HDFC bank: MCLRను సవరించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొన్ని కాలవ్యవధులకు MCLRను 5 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది.

Published : 07 Mar 2024 17:05 IST

దిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొన్ని కాలవ్యవధులపై MCLRను 5 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. సవరణ అనంతరం MCLR 8.95-9.35% మధ్య ఉంటుంది. ఓవర్‌నైట్‌ MCLR 8.90% నుంచి 8.95% శాతానికి, మూడు నెలల MCLR 9.10% నుంచి 9.15 శాతానికి పెరిగింది. ఒక నిర్దిష్ట రుణం కోసం ఆర్థిక సంస్థ విధించే కనీస వడ్డీ రేటును మార్జినల్‌ కాస్ట్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌ (MCLR) అంటారు. సాధారణంగా ఇది రుణానికి సంబంధించిన అతి తక్కువ వడ్డీ రేటును సూచిస్తుంది. MCLR కంటే తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంకు రుణాన్ని అందించదు. MCLRను నిర్ణయించేటప్పుడు డిపాజిట్‌ రేట్లు, రెపో రేట్లు, ఖర్చులు, నగదు నిల్వల నిష్పత్తిని నిర్వహించడానికి అయ్యే ఖర్చుతో సహా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. కొత్త రేట్లు 2024 మార్చి 7 నుంచి అమల్లోకి వస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని