గృహ బీమా క్లెయిం విధానం

గృహ బీమా క్లెయిం గురించి ముందే అవ‌గాహ‌న పెంచుకొని అందుకు సంసిద్ధంగా ఉండ‌డం మేలు.

Published : 25 Dec 2020 17:50 IST

వాహ‌నానికి, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు, జీవితానికి ర‌క్ష‌ణ క‌ల్పించే బీమా సంస్థ‌లు గృహానికి కూడా బీమాను క‌ల్పిస్తున్నాయి. గృహ బీమా తీసుకునే ట్రెండ్ ఇప్పుడిప్పుడే మ‌న‌దేశంలో పుంజుకుంటోంది. అమెరికా లాంటి దేశాల్లో గృహ బీమాను తీసుకునేవారు చాలా మందే ఉంటారు. గృహ బీమా తీసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో క్లెయిం చేసుకోవ‌డ‌మూ అంతే ముఖ్యం.

క్లెయిం చేసుకునే సంద‌ర్భాలు

  • అగ్నిప్ర‌మాదం సంభవించిన‌ప్పుడు

  • వ‌ర‌ద‌లు, భూకంపాలు లాంటి ప్ర‌కృతి వైప‌రిత్యాలు ఏర్ప‌డిన‌ప్పుడు

  • ఇంట్లో దొంగ‌లు ప‌డి విలువైన వ‌స్తువులు దోచుకెళ్లిన‌ప్పుడు

  • యుద్ధం, ఉగ్ర‌వాద చ‌ర్య‌ల వ‌ల‌న

  • కాలంతోపాటు గృహం పాత‌బ‌డిపోతుంటే మ‌ర‌మ్మ‌తు చేయించేందుకు

  • గృహ‌రుణం తీసుకున్న‌ప్పుడు

క్లెయిం చేసేందుకు అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన ప‌త్రాలు

  • పూర్తి వివ‌రాల‌తో నింపిన క్లెయిం ఫారం

  • దొంగ‌త‌నం జ‌రిగితే పోలీసుల నుంచి ప్రాథ‌మిక స‌మాచార నివేదిక‌(ఎఫ్‌.ఐ.ఆర్‌)

  • దిన‌ప‌త్రిక‌ల్లో సంఘ‌ట‌న‌కు సంబంధించిన వార్తా క్లిప్పింగులు

  • ప్ర‌మాదంలో దెబ్బ‌తిన్న భ‌వ‌న నిర్మాణ న‌మూనా

  • మ‌ర‌మ్మ‌తు చేసేందుకు అయ్యే అంచ‌నా వ్య‌యం వివ‌రాలు

  • ప్ర‌కృతి వైప‌రిత్యాల వ‌ల్ల గృహం దెబ్బ‌తింటే వాతావ‌ర‌ణ శాఖ నివేదిక‌

  • అగ్నిప్ర‌మాదం క్లెయింల కోసం గృహంలో అగ్నిమాప‌క ఏర్పాట్ల వివ‌రాలు

  • ఇంటికి సంబంధించిన ముఖ్య‌మైన డాక్యుమెంట్లు

  • గృహ యాజ‌మాని గుర్తింపు ప‌త్రం, ఇంటి చిరునామా, బ్యాంకు ఖాతా, పాన్ సంఖ్య, ఫొటోలు త‌దిత‌రాలు

క్లెయిం చేసే విధానం

  • గృహానికి ఏదైనా ప్ర‌మాదం జ‌రిగి దెబ్బ‌తింటే ఈ విష‌యాన్ని వెంట‌నే బీమా సంస్థ‌కు తెలియ‌జేయాలి.

  • దొంగ‌త‌నం, అగ్నిప్ర‌మాదం లాంటి సంభ‌విస్తే పోలీసుల‌కు తెలియ‌జేసి ఎఫ్‌.ఐ.ఆర్ నివేదిక‌ను పొందాలి.

  • దొంగ‌త‌నం జ‌రిగిన సంద‌ర్భంలో పోలీసులు దొంగ‌ల‌ను ప‌ట్టుకోలేక‌పోయిన‌ట్టు నాన్ ట్రేసియ‌బుల్ స‌ర్టిఫికెట్ ఉంటే జ‌రిగిన న‌ష్టానికి ప‌రిహారం బీమా సంస్థ ఇస్తుంది.

  • బీమా సంస్థ‌కు ప్ర‌మాద వివ‌రాల‌ను తెలిపిన త‌ర్వాత వారు స‌ర్వేయ‌ర్‌ను పంపిస్తారు.

  • న‌ష్టం అంచ‌నాను స‌ర్వేయ‌ర్ లెక్క‌వేసి చెబుతాడు. అత‌నికి మ‌నం స‌హ‌క‌రిచాల్సి ఉంటుంది.

  • పాల‌సీ డాక్యుమెంట్లు, పూర్తి చేసిన క్లెయిం ఫారంతో పాటు ఇత‌ర ముఖ్య‌మైన ప‌త్రాల‌ను బీమా ఏజెంటు ద్వారా లేదా నేరుగా బీమా సంస్థ‌కు అందేలా చూడాలి.

ప‌రిహారం అంద‌జేత‌

  • వివ‌రాల‌న్నీ ప‌రిశీలించాక బీమా సంస్థ బీమా హామీ సొమ్ము మేర‌కు ప‌రిహారం చెల్లిస్తుంది. లేదా న‌ష్టం జ‌రిగిన దానికి చెల్లిస్తుంది. వీటిలో ఏది త‌క్కువైతే దానికి స‌మానంగా ప‌రిహారం అంద‌జేస్తారు.

  • ప‌రిహారాన్ని నేరుగా బ్యాంకు ఖాతాకు జ‌మ‌చేస్తారు లేదా చెక్కు ద్వారా పాల‌సీదారుకు అంద‌జేస్తారు.

రుణ సంబంధ క్లెయిం

  • రుణానికి సంబంధించి క్లెయిం ఎలా ఉంటుందంటే ఇంటిపై రుణం తీసుకొని వాయిదాలు చెల్లించే పాల‌సీదారుకు అనుకోకుండా ఏదైనా జ‌రిగితే అప్పుడు పాల‌సీదారు త‌ర‌ఫున బీమా సంస్థే మిగ‌తా రుణాల‌ను చెల్లిస్తుంది. అయితే దీనికి కొన్నిష‌ర‌తులు ఉంటాయి. ఇవి బీమా సంస్థ‌ను బ‌ట్టి ఉంటాయి.

  • రుణ సంబంధ గృహ బీమా పొందేట‌ప్పుడు క్లెయిం విధానం, వ‌ర్తించే సంద‌ర్భాల‌ను తెలుసుకొని ఉండాలి.

గృహ బీమాను కొనుగోలు చేయ‌డం ఇప్పుడిప్పుడే మొద‌లుపెడుతున్నారు. కుటుంబ స‌భ్యుల్లో క్లెయిం విధానంపై పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించ‌డం పాల‌సీదారు బాధ్య‌త‌. క్లెయిం చేసుకున్నాక తిర‌స్క‌ర‌ణ‌కు గురికాకుండా అన్ని ర‌కాల ప‌త్రాల‌ను ద‌గ్గ‌రుంచుకోవ‌డం మంచిది. వీలైతే ఆన్‌లైన్‌లో పాల‌సీకి సంబంధించిన డాక్యుమెంట్ల‌ను భ‌ద్ర‌ప‌ర్చుకోవ‌డం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని