విమాన క్యాన్సిలేషన్ బీమా కవర్లను కొనడం మంచిదేనా?

ఈ రేట్లు ప్రయాణ బీమా పాలసీతో వచ్చే ఇతర కవర్లను కలిగి ఉండవని గమనించండి

Published : 27 Dec 2020 17:08 IST

కోవిడ్-19 కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన 60 రోజుల సుదీర్ఘ లాక్ డౌన్ తరువాత, చివరకు విమానయాన సంస్థలు అస్థిరమైన పద్ధతిలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాయి, అయితే విమాన ప్రయాణం చుట్టూ అనిశ్చితి ఇప్పటికీ కొనసాగుతోంది. విమాన కార్యకలాపాలపై విమానయాన మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం కారణంగా, ప్రారంభమైన మొదటి రోజునే వందలాది విమానాలు రద్దు అయ్యాయి.

రాబోయే కొద్ది వారాల్లో విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు కొంత విరామం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్లు అయిన ఇక్సిగో, హ్యాపీఈజీగో ప్రత్యేక ట్రిప్ క్యాన్సిలేషన్ కవర్లతో ముందుకు వచ్చారు. ఈ కవర్లు చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఎక్కువ ధర పెట్టి వీటిని కొనడం మంచిదేనా?

ఆఫర్‌లో ఏముంది?

విమానాలను పునః ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్న వెంటనే, హ్యాపీఈజీగో మీ కొత్త రీషెడ్యూల్‌పై ఉచిత బీమా అందిస్తున్న ప్రచార ఎస్ఎంఎస్ లను పంపింది. మే 28న న్యూఢిల్లీ నుంచి ముంబై వెళ్లే విమానానికి మీరు రూ. 3,704 ప్రాథమిక ధరకి బదులుగా రూ. 3,954 చెల్లించినట్లయితే, ఉచిత రీషెడ్యూలింగ్ ఆప్షన్ ను అందిస్తోంది. అయితే, మీరు చార్జీలలోని వ్యత్యాసాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు రూ. 4,104 చెల్లించినట్లయితే, మీకు ఉచిత విమాన క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా లభిస్తుంది, కానీ కన్వీనియన్స్ ఫీజు, ఉచిత క్యాన్సిలేషన్ ఫీజు తిరిగి చెల్లించరు.

ఈ రేట్లు ప్రయాణ బీమా పాలసీతో వచ్చే ఇతర కవర్లను కలిగి ఉండవని గమనించండి. లగేజ్ కోల్పోవడం, వ్యక్తిగత ప్రమాద కవర్లు వంటి అదనపు ప్రయోజనాలను పొందడానికి మీరు అదనంగా రూ. 249 ప్లస్ పన్నులను చెల్లించాల్సి ఉంటుంది.

ఇక్సిగో కూడా లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్‌ భాగస్వామ్యంతో “ఇక్సిగో అషూర్డ్” అనే కొత్త ఉత్పత్తిని ప్రారంభించింది. గతంలో చాలా మంది ట్రావెల్ ఏజెంట్లు ఉచిత క్యాన్సిలేషన్ కవర్లను విక్రయించేవారు, కానీ కోవిడ్ -19 వచ్చిన తర్వాత లేదా ధరలను గణనీయంగా పెంచిన తర్వాత చాలా మంది దీనిని నిలిపివేశారు. ఈ ఉత్పత్తితో రాబోయే అనిశ్చితులను అధ్యయనం చేయడానికి మేము లాక్ డౌన్ సమయాన్ని వినియోగించుకున్నామని ఇక్సిగో సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అలోక్ బాజ్‌పాయ్ తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కారణంగా ప్రయాణికులు ఎదుర్కొనే ఆందోళనను ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుందని బాజ్‌పాయ్ తెలిపారు. మా ఉచిత క్యాన్సిలేషన్ కవర్ ను తిరిగి మార్చడం, ప్రయాణీకులు భరించగలిగే ధరకే ఇవ్వడం దీని లక్ష్యమని బాజ్‌పాయ్ తెలిపారు.

ఉత్పత్తి ప్రీమియం రూ. 399 నుంచి ప్రారంభమవుతుంది, ప్రయాణ తేదీ ఆధారంగా ఇది రూ. 599 వరకు ఉంటుంది. ఉదాహరణకు, మీరు రాబోయే ఏడు రోజుల్లో ప్రయాణానికి విమాన టికెట్ ను బుకింగ్ చేసుకున్నట్లైయితే, ప్రీమియం రూ. 399 గా ఉంటుంది, అదే మీరు 31 నుంచి 90 రోజుల తరువాత ప్రయాణానికి ఫ్లైట్ బుక్ చేసినట్లయితే, ప్రీమియం రూ. 599 అవుతుంది. సాధారణ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అందించే ప్రయోజనాలతో పాటు, ఈ ఉత్పత్తి మీ బుకింగ్‌లను క్యాన్సిల్ చేయడానికి, ప్రతి టికెట్‌లో రూ. 5,000 వరకు వాపసు పొందే అవకాశాన్ని ఇస్తుంది.

అయితే, దీనికి కొన్ని నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. విమానం బయలుదేరే తేదీకి కనీసం 24 గంటల ముందు మీరు టికెట్‌ను క్యాన్సిల్ చేస్తేనే, ట్రిప్ క్యాన్సిల్ కవర్ క్లెయిమ్ చేయవచ్చు. విమానయాన సంస్థ పనిచేయని సందర్భాల్లో, ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ తో ట్రావెల్ ఏజెంట్ కు సంబంధం ఉండదు.

అలాగే, మీ టికెట్ ధర రూ. 5,000 కంటే ఎక్కువగా ఉంటే మీకు పూర్తి రిఫండ్ లభించదని గమనించండి. ప్రభుత్వం రాబోయే మూడు నెలల్లో విమాన చార్జీలను పరిమితం చేసింది, చాలా మార్గాల్లో ఎగువ పరిమితి రూ. 5,000 పైనే ఉంది. ఉదాహరణకు, ఢిల్లీ నుంచి ముంబై మార్గంలో తిరిగే విమానాలకు, విమానయాన సంస్థలు రూ. 10,000 వరకు వసూలు చేయవచ్చు. ఈ సందర్భంలో, మీరు ఇక్సిగో అస్యూర్డ్‌ను కొనుగోలు చేసినట్లయితే, మీకు రూ. 5,000 మాత్రమే తిరిగి లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని