Nokia 105 Classic: యూపీఐ ఫీచర్‌తో నోకియా 105 క్లాసిక్‌ ఫోన్‌

Nokia 105 Classic: యూపీఐతో కూడిన మరో ఫీచర్‌ ఫోన్‌ను నోకియా విడుదల చేసింది. నోకియా 105 క్లాసిక్‌ పేరుతో దీన్ని తీసుకొచ్చింది.

Published : 27 Oct 2023 14:42 IST

Nokia 105 Classic | నోకియా మరో ఫీచర్‌ ఫోన్‌ను విడుదల చేసింది. నోకియా 105 సిరీస్‌లో దీన్ని తీసుకొచ్చింది. నోకియా 105 క్లాసిక్‌ పేరిట వస్తున్న ఈ ఫోన్‌లో ఆన్‌లైన్‌ లావాదేవీలను సులభతరం చేసేలా యూపీఐ అప్లికేషన్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇస్తుండడం విశేషం. ఈ ఫోన్‌పై కంపెనీ ఏడాది రీప్లేస్‌మెంట్‌ గ్యారెంటీ కూడా ఇస్తోంది. సింగిల్‌ సిమ్‌, డ్యుయల్‌ సిమ్‌ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. ఛార్జర్‌తో కలిపి లేదా ఛార్జర్‌ లేకుండా కూడా దీన్ని కొనుగోలు చేయొచ్చు. రెండు రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తోంది.

నోకియా 105 క్లాసిక్‌ ధర రూ.999. 800mAh బ్యాటరీని పొందుపర్చారు. వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం రేడియో ఫీచర్‌ కూడా ఉంది. పూర్తి ఫీచర్ల జాబితాను కంపెనీ అధికారికంగా విడుదల చేయలేదు. ఈ ఏడాదిలోనే యూపీఐ 123పే సపోర్ట్‌తో నోకియా 105 (2023) సైతం విడుదలైన విషయం తెలిసిందే. దీని ధర రూ.1,299. చార్‌కోల్‌, సియాన్‌, ఎరుపు రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని