OnePlus Speakers: వన్‌ప్లస్‌ నుంచి త్వరలో స్పీకర్లు?

OnePlus Speaker: ‘గెట్‌ రెడీ టు మేక్‌ సమ్‌ మ్యూజిక్‌’ క్యాప్షన్‌తో ఇన్‌స్టా పోస్ట్‌లో ఓ చిన్న వీడియోను వన్‌ప్లస్‌ పోస్ట్‌ చేసింది. దీంతో కంపెనీ త్వరలో స్పీకర్లను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 17 Nov 2023 13:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్‌ప్లస్‌ తమ ఆడియో డివైజ్‌ల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మార్కెట్‌లోకి కొత్త స్పీకర్‌ (OnePlus Speakers)ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన ఈ కంపెనీ ఇప్పటికే పలు వైర్డ్‌, వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్లు, హెడ్‌ఫోన్లను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోనే కంపెనీ నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌, నార్డ్‌ బడ్స్‌ 2ను విడుదల చేసింది. త్వరలో వన్‌ప్లస్‌ బడ్స్‌ 3ను కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా స్పీకర్ల విడుదలకు సంబంధించిన ఓ చిన్న వీడియోను బయటకు వదిలింది. దీంట్లో డిజైన్‌ ఎలా ఉండనుందో కూడా కనిపిస్తోంది.

‘గెట్‌ రెడీ టు మేక్‌ సమ్‌ మ్యూజిక్‌’ క్యాప్షన్‌తో ఇన్‌స్టా పోస్ట్‌లో ఓ చిన్న వీడియోను వన్‌ప్లస్‌ పోస్ట్‌ చేసింది. దీంతో ఇవి స్పీకర్లేననే విషయం స్పష్టమవుతోంది. ఈ వీడియోలో స్పీకర్ల హార్డ్‌వేర్‌ ఎలా ఉండనుందో కనిపిస్తోంది. వివిధ దిశల్లో పలు వూఫర్లు ఉండడం గమనించొచ్చు. బహుశా 360 డిగ్రీల ఆడియో ఎక్స్‌పీరియెన్స్‌ను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకు మించి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

వన్‌ప్లస్‌ నుంచి నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌ రూ.2,199 ధరతో అందుబాటులో ఉంది. ఇవి డీప్‌ గ్రే, ట్రిపుల్‌ బ్లూ రంగుల్లో లభిస్తున్నాయి. మరోవైపు నార్డ్‌ బడ్స్‌ 2 ధర రూ.2,999. వాయిస్‌ కాల్స్‌ సమయంలో నాయిస్‌ క్యాన్సిలేషన్‌ కోసం వీటిలో 12.4ఎంఎం డైనమిక్‌ డ్రైవర్స్‌ను పొందుపర్చారు. నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌ బ్యాటరీ లైఫ్‌ 46 గంటలు కాగా.. బడ్స్‌ 2 బ్యాటరీ లైఫ్‌ 36 గంటలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు