Oppo Find N3: ఒప్పో ఫైండ్‌ ఎన్‌3 ఫోల్డబుల్‌ ఫోన్‌ విడుదల.. ఫీచర్లివే

Oppo Find N3: ఫైండ్‌ ఎన్‌2కు కొనసాగింపుగా ఒప్పో ఫైండ్‌ ఎన్‌3 ఫోల్డబుల్‌ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదల చేసింది.

Updated : 19 Oct 2023 15:32 IST

Oppo Find N3 | చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో మరో ఫోల్డబుల్‌ ఫోన్‌ను విడుదల చేసింది. ఒప్పో ఫైండ్‌ ఎన్‌3 (Oppo Find N3) పేరిట వస్తున్న ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 ప్రాసెసర్‌ను అమర్చారు. కొత్త ఫ్లెక్సికాన్‌ హింజ్‌తో దీన్ని తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది.

ఒప్పో ఫైండ్‌ ఎన్‌3 (Oppo Find N3) 16GB + 256GB storage వేరియంట్‌లో మాత్రమే లభిస్తోంది. భారత్‌లో దీని ధరను ఇంకా వెల్లడించాల్సి ఉంది. సింగపూర్‌లో దీని ధరను కంపెనీ 2,399 సింగపూర్‌ డాలర్లుగా నిర్ణయించింది (దాదాపు రూ.1.45 లక్షలు). ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత కలర్‌ఓఎస్‌13తో ఈ ఫోన్‌ వస్తోంది. 7.72 అంగుళాల  2K (2,268 x 2,440 pixels) LTPO 3.0 అమోలెడ్‌ తెరను అమర్చారు. 6.31 అంగుళాల 2K (1,116x2,484 pixels) అమోలెడ్‌ తెరతో కవర్‌ స్క్రీన్‌ను ఇచ్చారు. షాంపేన్‌ గోల్డ్‌, గ్రీన్‌ నలుపు రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. 

క్వాల్‌కామ్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 ప్రాసెసర్‌తో వస్తోన్న ఒప్పో ఫైండ్‌ ఎన్‌3లో 48 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమేరా ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ కోసం ఇన్నర్‌ డిస్‌ప్లేలో 20 మెగాపిక్సెల్‌, ఔటర్‌ స్క్రీన్‌లో 32 మెగాపిక్సెల్‌ కెమేరాను ఇచ్చారు. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 7, బ్లూటూత్‌ 5.3, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, యూఎస్‌బీఐ టైప్‌-సి పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 67 వాట్‌ SuperVOOC 2.0 ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రూ.4,805mAh బ్యాటరీని పొందుపర్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని