Oppo: 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రెనో 10 5జీ.. ధర, ఫీచర్లు ఇవే..

Oppo: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తన రెనో సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.

Published : 20 Jul 2023 14:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో (Oppo) భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ లాంచ్‌ చేసింది. ఒప్పో రెనో 10 5జీ (Oppo Reno 10 5G) పేరుతో ఫోన్‌ తీసుకొచ్చింది. దీంతో తన రెనో10 సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ వచ్చి చేరింది. ట్రిపుల్‌ కెమెరాతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

ఒప్పో రెనో 10 5జీ (Oppo Reno 10 5G) స్మార్ట్‌ఫోన్‌  8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.32,999గా కంపెనీ నిర్ణయించింది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్‌ రేటింగ్‌తో పాటు 240Hz టచ్ పాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. ఈ మొబైల్ 7050 SoC ప్రాసెసర్‌తో ఉంటుందని ఒప్పో వెల్లడించింది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ColorOS 13.1తో ఈ మొబైల్‌ పనిచేస్తుంది. 

సహజవాయువు 14 ఏళ్ల పాటు దిగుమతి

ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఇచ్చారు. 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 32ఎంపీ టెలిఫోటో లన్స్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్‌ లెన్స్‌ను అమర్చారు. ఇక ముందు వైపు సెల్ఫీ కోసం 32ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,000mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌ 67W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. బ్లూ, సిల్వరీ గ్రే.. ఈ రెండు రంగుల్లో ఫోన్ లభిస్తుంది. ఈ రోజు నుంచి ప్రీ బుకింగ్‌ ఆర్డర్లు మొదలయ్యాయని కంపెనీ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో వెబ్‌సైట్ల ద్వారా వీటిని కొనుగోలు చేయచ్చని ఒప్పో ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, యాక్సిస్‌, ఐసీఐసీఐ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3,000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని