Milk prices: అమూల్‌, మదర్‌ డెయిరీ పాలు ప్రియం.. లీటర్‌కు ₹2 పెంపు

Milk prices: అమూల్‌ బ్రాండ్‌పై పాలు విక్రయించే గుజరాత్‌ కోపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (GCMMF) పాల ధరలను పెంచింది.

Published : 16 Aug 2022 16:39 IST

ఆనంద్‌/దిల్లీ: అమూల్‌ బ్రాండ్‌పై పాలు విక్రయించే గుజరాత్‌ కోపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (GCMMF) పాల ధరలను పెంచింది. గోల్డ్‌, తాజా, శక్తి మిల్క్‌పై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు GCMMF ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం (ఆగస్టు 17) నుంచి ఈ పెంపుదల అమల్లోకి వస్తుందని పేర్కొంది. పాల ఉత్పత్తి ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

అయితే, సగటు ఆహార పదార్థాల ద్రవ్యోల్బణంతో పోలిస్తే లీటర్‌కు రూ.2 పెంపు (4శాతం) తక్కువేనని ఫెడరేషన్‌ తెలిపింది. పెరిగిన పాల ధరలు గుజరాత్‌లోని సౌరాష్ట్ర, దిల్లీ ఎన్‌సీఆర్‌, పశ్చిమ బెంగాల్‌, ముంబయితో పాటు అమూల్‌ మార్కెటింగ్‌ చేసే ప్రతి చోటా వర్తిస్తాయని తెలిపింది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో అర లీటర్‌ అమూల్‌ గోల్డ్‌ పాలు రూ.31 ఉండగా.. అమూల్‌ తాజా పాలను రూ.25కు, అమూల్‌ శక్తిని రూ.28 చొప్పున విక్రయిస్తున్నారు.

అదే బాటలో మదర్‌ డెయిరీ

మదర్‌ డెయిరీ సైతం పాల ధరను పెంచింది. దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు పేర్కొంది. బుధవారం నుంచే ఈ పెంపుదల వర్తిస్తుందని తెలిపింది. పాలసేకరణ, ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మార్చిలోనూ మదర్‌ డెయిరీ లీటర్‌కు రూ.2 చొప్పున పెంచింది. దిల్లీ రాజధాని ప్రాంతంలో రోజుకు 30 లక్షల లీటర్లకు పైగా పాలను మదర్‌ డెయిరీ విక్రయిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని