ఈపీఎఫ్ఓ సందేహాల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం

కార్మిక మంత్రిత్వ శాఖ సోమ‌వారం ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీకి సంబంధించిన ప్ర‌శ్న‌లు సందేహాల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించేందుకు కొత్త సంస్క‌ర‌ణ‌ల‌ను విధానాల‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలిపింది. 2019 లో మొత్తం 9,02,203 ఫిర్యాదులు వ‌చ్చాయి. అందులో ఇప్ప‌టివ‌ర‌కు 8,38,579 ఫిర్యాదుల‌కు ప‌రిష్కారం ల‌భించింద‌ని లోక్‌స‌భ‌కు ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో పేర్కొంది...

Updated : 01 Jan 2021 18:06 IST

కార్మిక మంత్రిత్వ శాఖ సోమ‌వారం ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీకి సంబంధించిన ప్ర‌శ్న‌లు సందేహాల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించేందుకు కొత్త సంస్క‌ర‌ణ‌ల‌ను విధానాల‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలిపింది. 2019 లో మొత్తం 9,02,203 ఫిర్యాదులు వ‌చ్చాయి. అందులో ఇప్ప‌టివ‌ర‌కు 8,38,579 ఫిర్యాదుల‌కు ప‌రిష్కారం ల‌భించింద‌ని లోక్‌స‌భ‌కు ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో పేర్కొంది.

కార్మిక మంత్రి సంతోశ్ గాంగ్వ‌ర్ మాట్లాడుతూ ప్ర‌జ‌లకు ఎదుర‌వుతున్న స‌మ‌స్యలు, ప్ర‌శ్న‌ల‌కు ప‌రిష్క‌రించేందుకు నిరంత‌రం స‌మీక్ష జ‌రుపుతున్నామ‌ని తెలిపారు. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ, చీఫ్ లేబ‌ర్ క‌మీష‌నర్‌కు వ‌స్తున్న‌ సంబంధిత ప్ర‌శ్న‌లు, స‌మ‌స్య‌ల కోసం విధాన‌ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌లు, సాంకేతిక‌తో కూడిన ప‌రిష్క‌రాలు చూపుతున్నట్లు తెలిపారు.

సెంట్ర‌ల్ ప‌బ్లిక్ గ్రీవెన్సెన్స్ రిడ్రెస్ అండ్ మానిట‌రింగ్ సిస్ట‌మ్ (సీపీజీఆర్ఏఎమ్ఎస్‌) కి 47,567 ఫిర్యాదులు రాగా, అందులో 46,283 పరిష్క‌రించారు. స‌మ‌స్య‌ల‌ పరిష్కారానికి సంబంధించి విధానాలను కార్మిక మంత్రిత్వ శాఖ క్రమంగా సమీక్షించి, క్రమబద్ధీకరిస్తోందని చెప్పారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని