మరో కొత్త కంపెనీలో రతన్‌ టాటా పెట్టుబడులు

టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా.. తమ సంస్థలో వాటాలు కొనుగోలు చేసినట్లు ప్రితీశ్‌ నందీ కమ్యూనికేషన్స్‌ వెల్లడించింది. గత వారం ఆయన తన వ్యక్తిగత హోదాలో

Published : 15 Mar 2021 21:23 IST

ముంబయి: టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా.. తమ సంస్థలో వాటాలు కొనుగోలు చేసినట్లు ప్రితీశ్‌ నందీ కమ్యూనికేషన్స్‌ వెల్లడించింది. గత వారం ఆయన తన వ్యక్తిగత హోదాలో మార్కెట్‌ పర్చేజ్‌ ద్వారా వాటాల్ని దక్కించుకున్నట్లు తెలిపింది. అంకుర సంస్థలు, సాంకేతికత సంస్థల్ని ప్రోత్సహించేందుకు రతన్‌ టాటా వాటిల్లో పెట్టుబడులు పెడుతుంటారని గుర్తుచేసింది.

ప్రితీశ్‌ నందీ కమ్యూనికేషన్స్‌ని 1993లో స్థాపించారు. టీవీ కంటెంట్‌ అందించే సంస్థగా ఏర్పాటైన ఈ కంపెనీ అనేక వార్తా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాల్ని నిర్వహించింది. 2000 సంవత్సరంలో ఐపీవోకి వచ్చింది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోని ఓ కార్పొరేట్‌ సంస్థ పబ్లిక్‌ ఇష్యూకి రావడం అదే తొలిసారి. గత 18 ఏళ్లలో సంస్థ స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.2,653గా ఉన్నట్లు సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఇవీ చదవండి..

వరుసగా రెండో నెలా పెరిగిన టోకు ద్రవ్యోల్బణం

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే 5 కొత్త ఆదాయపు పన్ను నియమాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని