JIO Prepaid Plans: జియో ప్లాన్‌.. ₹151తో 3 నెలల డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌!

రిలయన్స్‌ జియో ఐపీఎల్‌ ప్రారంభంలో డిస్నీ+ హాట్‌స్టార్‌తో కూడిన నాలుగు ప్రత్యేక ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది....

Updated : 04 Jun 2022 15:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ ఆరంభంలో డిస్నీ+ హాట్‌స్టార్‌తో కూడిన నాలుగు ప్రత్యేక ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను రిలయన్స్‌ జియో ప్రవేశపెట్టింది. ఐపీఎల్‌ లక్ష్యంతో వీటిని తీసుకొచ్చినప్పటికీ.. సాధారణంగా కూడా ఇవి యూజర్లకు మంచి ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. మూడు నెలల కాలపరిమితి కలిగిన వీటి ధరలు రూ.151, రూ.333, రూ.583, రూ.783గా ఉన్నాయి.

రూ.151 ప్లాన్‌: ఇది పూర్తిగా డేటా ప్లాన్‌. ఇది పనిచేయాలంటే కచ్చితంగా బేస్‌ ప్లాన్‌ ఉండాల్సిందే. దీంట్లో మొత్తం 8 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ.149 విలువ కలిగిన డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది. దీని వ్యాలిడిటీ 90 రోజులు. 8 జీబీ డేటా వినియోగం తర్వాత వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.

రూ.333 ప్లాన్‌: దీని కాలపరిమితి 28 రోజులు. రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు ఉండనే ఉంటాయి. మూడు నెలల కాలపరిమితితో డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌ వంటి అదనపు ప్రయోజనాలు కూడా అందుతాయి.

రూ.583 ప్లాన్‌: రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 56 రోజులు. మొత్తంగా 84 జీబీ డేటా పొందవచ్చు. అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. దీంట్లో కూడా మూడు నెలల కాలపరిమితితో కూడిన డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌ అదనపు ప్రయోజనాలు.

రూ.783 ప్లాన్‌: దీంట్లో ప్రయోజనాలు రూ.583 ప్లాన్ తరహాలోనే ఉంటాయి. కానీ, కాలపరిమితి మాత్రం 84 రోజులు. డిస్నీ+ హాట్‌స్టార్‌ను మూడు నెలలు ఎంజాయ్‌ చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని