Reliance Industries: క్యూ4 ఫలితాల్లో అదరకొట్టిన రిలయన్స్‌.. రూ.19,299 కోట్ల లాభం

Reliance Industries: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాల్ని శుక్రవారం ప్రకటించింది.

Published : 21 Apr 2023 23:58 IST

దిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) నాలుగో త్రైమాసిక ఫలితాల్లో అదరకొట్టింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 19 శాతం నికర లాభాన్ని అర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.16,203 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయగా.. ఈ ఏడాదిలో రూ.19,299 కోట్లకు పెరిగింది. ఇదే ఇప్పటివరకు అత్యధికంగా అర్జించిన నికర లాభం అని కంపెనీ తన ఫైలింగ్‌లో తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరం మార్చి ముగిసే సమయానికి రూ. 2.11 లక్షల కోట్లు ఉన్న కంపెనీ ఆదాయం 2023 మార్చి ముగిసే సమయానికి రూ. 2.16 లక్షలకు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి మెత్తం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.66,702 కోట్ల నికర లాభాన్ని సొంతం చేసుకుంది. రూ.9 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 

జియో అదుర్స్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి చెందిన రిలయన్స్‌ జియో (Reliance Jio) సైతం నాలుగో త్రైమాసికంలో మంచి లాభాల్ని అర్జించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో 16 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.4,173  కోట్లుగా కాగా.. ఈ ఏడాదిలో కంపెనీ రూ.4,716 కోట్లు అర్జించింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ నికర లాభం 23 శాతం పెరగటం గమనార్హం. గత త్రైమాసికంలో రూ. 20,945 కోట్లుగా ఉన్న ఆదాయం 12 శాతం పెరిగి రూ. 23,394 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ ఆదాయం 18 శాతం పెరిగింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని