Azorte: బెంగళూరులో రిలయన్స్‌ రిటైల్‌ తొలి అజోర్టే స్టోర్‌

అజోర్టే బ్రాండ్‌ పేరిట రిలయన్స్‌ రిటైల్‌ తొలి ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ స్టోర్‌ను గురువారం బెంగళూరులో ప్రారంభించింది....

Published : 29 Sep 2022 23:45 IST

బెంగళూరు: అజోర్టే బ్రాండ్‌ పేరిట రిలయన్స్‌ రిటైల్‌ తొలి ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ స్టోర్‌ను గురువారం బెంగళూరులో ప్రారంభించింది. మిడ్‌-టు-ప్రీమియం విభాగంలోని వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించినట్లు రిలయన్స్‌ రిటైల్‌ తెలిపింది. దుస్తుల నుంచి పలు సౌందర్య ఉత్పత్తులను కూడా దీంట్లో విక్రయించనున్నారు. వచ్చే తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో మరో 30 స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. అలా మూడేళ్లలో మొత్తం 200 స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. మిలినియల్స్‌, జనరేషన్‌-జెడ్‌ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ బ్రాండ్లను అందుబాటులో ఉంచనున్నట్లు అజోర్టే సీఈఓ అఖిలేశ్‌ ప్రసాద్‌ తెలిపారు. జరా, మ్యాంగోకు పోటీగా రిలయన్స్‌ అజోర్టేను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని