Growth Forecast: ఆర్థిక వృద్ధికి కొవిడ్‌ పోటు..!

ఎస్‌అండీపీ గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు అంచనాలను సవరించింది. గతంలో ప్రకటించిన 11 శాతం నుంచి 9.5శాతానికి కుదించింది. భవిష్యత్తులో మరిన్ని  వేవ్‌లు వస్తే అంచనాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. 

Updated : 16 Nov 2022 16:52 IST

 అంచనాలు సవరించిన ఎస్‌ అండ్‌ పీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎస్‌అండీపీ గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు అంచనాలను సవరించింది. గతంలో ప్రకటించిన 11 శాతం నుంచి 9.5శాతానికి కుదించింది. భవిష్యత్తులో మరిన్ని  వేవ్‌లు వస్తే అంచనాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. 

అంచనాల తగ్గింపుపై స్పందిస్తూ.. ఏప్రిల్‌, మే నెలల్లో కొవిడ్‌కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ బాటపట్టడంతో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ‘‘ఈ ఆర్థిక సంవత్సరంపై మేము మార్చిలో ప్రకటించిన 11శాతం వృద్ధిరేటు అంచనాలను 9.5శాతానికి కుదిస్తున్నాము. భవిష్యత్తులో మరిన్ని వేవ్‌లు వస్తే అంచనాలపై ప్రభావం చూపుతుంది. ఇప్పటి వరకు కేవలం 15శాతం మంది మాత్రమే  ఒక డోస్‌ తీసుకొన్నారు. టీకాల సరఫరాలు పెంచాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొంది.  

పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ కంపెనీల బ్యాలెన్స్‌ షీట్లను కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ దెబ్బతీసిందని అభిప్రాయపడింది. భవిష్యత్తులో కొన్నేళ్లపాటు దీని వృద్ధిరేటుపై దీని ప్రభావం పడుతుందని పేర్కొంది. 2023 మార్చి31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 7.8శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రజలు నిత్యావసరాలు తీర్చుకోవడానికి దాచుకొన్న డబ్బులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో భవిష్యత్తులో వారు తిరిగి డిపాజిట్లను పెంచుకోవడంపై దృష్టిపెడతారు. ఆర్థిక వ్యవస్థ తెరుచుకొన్న వెంటనే మార్కెట్లో ఖర్చుపెట్టకపోవచ్చు అని ఎస్‌అండ్‌పీ అంచనా వేసింది. 

ఇటీవలే ఆర్‌బీఐ కూడా వృద్ధిరేటును 10.5శాతం నుంచి 9.5శాతానికి కుదించింది. 2020తో పోలిస్తే ఈ సారి మాత్రం తయారీ రంగం, ఎగుమతులు అంత తీవ్రంగా ప్రభావితం కాలేదని పేర్కొంది. కాకపోతే వాహన విక్రయాలు వంటి వినిమయ వస్తువుల కొనుగోళ్లు మే మాసంలో వేగంగా పడిపోయాయని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని