London Stock Exchange: లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీని అడ్డుకునేందుకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు

లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(London Stock Exchange)లో అంతరాయం సృష్టించాలని పన్నిన కుట్రను మెట్రో పోలీసులు భగ్నం చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Updated : 15 Jan 2024 10:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(London Stock Exchange)లో అంతరాయం సృష్టించాలని కుట్ర పన్నిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మెట్రో పాలిటిన్‌ పోలీస్‌ విభాగం వెల్లడించింది. పాలస్తీనా మద్దతుదారులు కొందరు.. సోమవారం మార్కెట్‌ను అడ్డుకోవాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఎక్స్ఛేంజీ భవనాన్ని బలవంతంగా మూసివేయడం, విధ్వంసం సృష్టించడం, ట్రేడింగ్‌ మొదలు కాకుండా చేయడం వంటివి ప్లాన్‌ చేశారని.. నిందితులు తమ ఆధీనంలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి వయసు 20-30 మధ్య ఉంటుందని చెప్పారు.

అమెరికాకు మన ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు భళా

యూకే (UK) న్యూస్‌పేపర్‌ ‘ది డెయిలీ ఎక్స్‌ప్రెస్‌’ నుంచి అందుకున్న సమాచారం మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ పత్రిక తమ రిపోర్టర్లను రహస్యంగా పాలస్తీనా యాక్షన్‌ గ్రూప్‌ సమావేశానికి పంపగా ఈ విషయం బయటపడింది. పాలస్తీనా ఆందోళనకారుల సమన్వయం కోసం ఆ సమావేశం జరిగింది. ఆ పత్రిక సమావేశ సమాచారం ఇవ్వడం వల్లే వీరిని అడ్డుకోగలినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. పాలస్తీనా మద్దతుదారులు చేపట్టిన వారం రోజుల ఆందోళనల్లో ఈ ప్లాన్‌ ఒకటని వెల్లడించారు.

ఇజ్రాయెల్‌ రక్షణ శాఖతో కలిసి పనిచేసే కంపెనీలను నష్టాలను గురిచేయడమే ఆందోళనకారుల లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. వీరు స్టాక్‌ ఎక్స్ఛేంజీ తలుపులను గొలుసులతో బిగించాలని భావించినట్లు వెల్లడించారు. వీరి ప్రణాళిక విజయవంతమైతే.. ఇన్వెస్టర్లకు వందల కోట్ల డాలర్ల నష్టాలు వచ్చేవని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సెక్యూరిటీల ట్రేడింగ్‌లో లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ అత్యంత కీలకమైంది. ఇది ఆసియా-అమెరికా మార్కెట్లకు మధ్య వారధిలా పనిచేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని