అమెరికాకు మన ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు భళా

మనదేశం నుంచి అమెరికాకు గతేడాది జనవరి-సెప్టెంబరులో 6.6 బిలియన్‌ డాలర్ల (సుమారు   రూ.54,800 కోట్ల) విలువైన ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు ఎగుమతి అయ్యాయని పరిశ్రమ సంఘం ఐసియా (ఇండియన్‌ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌) ఛైర్మన్‌ పంకజ్‌ మొహింద్రో తెలిపారు.

Published : 15 Jan 2024 02:33 IST

పరిశ్రమ సంఘం ఐసియా వెల్లడి

దిల్లీ: మనదేశం నుంచి అమెరికాకు గతేడాది జనవరి-సెప్టెంబరులో 6.6 బిలియన్‌ డాలర్ల (సుమారు   రూ.54,800 కోట్ల) విలువైన ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు ఎగుమతి అయ్యాయని పరిశ్రమ సంఘం ఐసియా (ఇండియన్‌ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌) ఛైర్మన్‌ పంకజ్‌ మొహింద్రో తెలిపారు. 2022 ఇదే కాల ఎగుమతులు 2.6   బి.డా. (సుమారు రూ.21,600 కోట్ల)తో పోలిస్తే ఇవి 253% అధికం. 2018లో మనదేశం నుంచి అమెరికాకు 1.3 బి.డా. ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతి అయితే, 2022లో ఈ మొత్తం 300% పెరిగి 4.5 బి.డా.కు చేరింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఎలక్ట్రానిక్స్‌ వాణిజ్యం 2023 జనవరి-సెప్టెంబరులో 9 బి.డా. కాగా, 2022 ఇదే సమయంలో 4.9బి.డా. మాత్రమే. ఇదే సమయంలో చైనా నుంచి అమెరికాకు ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు తగ్గాయి. 2018లో వీటి వాటా 46% కాగా, 2023 జనవరి-సెప్టెంబరులో ఇది 24 శాతానికి తగ్గింది. 2018లోనే చైనా ఉత్పత్తులపై 25% దిగుమతి సుంకాన్ని అమెరికా విధించడం గమనార్హం. అయితే 2018 నుంచి 2022 మధ్య వియత్నాం ఎగుమతులు 420%, తైవాన్‌ ఎగుమతులు 239% పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు