AI: ఏఐ సాయంతో ఒకేసారి వేల ఉద్యోగాలకు దరఖాస్తు

AI: రెండు సార్లు లేఆఫ్‌ సమస్యను ఎదుర్కొన్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏఐ సాయంతో వేల సంఖ్యలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు.

Updated : 12 Nov 2023 12:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కంపెనీలు పెద్ద ఎత్తున లేఆఫ్‌లు ప్రకటిస్తున్న సమయంలో ఉద్యోగం సంపాదించటం చాలా కష్టంగా మారుతోంది. దీంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేయటం, ఇంటర్య్యూలకు హాజరు కావటం కోసం కొత్త తరహా పద్ధతులను వెతుక్కొంటున్నారు. ఇలానే లేఆఫ్‌ల సమయంలో రెండు సార్లు ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి ఏఐ సాయంతో ఉద్యోగాల వేట మొదలు పెట్టాడు. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్నాడు.

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేసే జూలియన్‌ జోసెఫ్‌ రెండుసార్లు లేఆఫ్‌ల సమస్యను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం వెతకటం మొదలుపెట్టాడు. దీంతో ఎక్కువ సమయం ల్యాప్‌ట్యాప్‌ ముందే కూర్చొని తన నైపుణ్యానికి సంబంధించిన జాబ్‌ను వెతుకుతూ వాటికి దరఖాస్తులు పంపేవాడు. తర్వాత కృత్రిమ మేధ (AI) సాయంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకున్నాడు. దాని కోసం ఏఐ ఆధారంగా పనిచేసే జాబ్ జీపీటీ ఏఐ బాట్‌ సాయం తీసుకున్నాడు. కేవలం నైపుణ్యం, పని అనుభవం, ఉద్యోగ వివరాల గురించి కొంత సమాచారాన్ని ఈ ఏఐ బాట్‌కు అందించాడు. అంతే సింగిల్‌ క్లిక్‌తో ఒకే సారి వేలాది సంఖ్యలో ఉద్యోగాలకు దరఖాస్తులు చేశాడు.

రిలాక్స్‌ అయ్యేందుకు ఎలాన్‌ మస్క్‌ ఏం చేస్తారో తెలుసా?

రెండు సిస్టమ్‌ల నుంచి కేవలం ఒక రాత్రిలోనే దాదాపు వెయ్యి ఉద్యోగాలకు జోసెఫ్‌ దరఖాస్తు చేశాడు. ఇలా ఏఐ సాయంతో మొత్తం 5 వేల ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే కేవలం 20 ఇంటర్వ్యూలకు మాత్రమే హాజరయ్యే అవకాశం లభించింది. ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే..  ఏఐ సాయంతో అప్లై చేసిన వాటి కంటే మ్యానువల్‌గా చేసిన దరఖాస్తులకే ఎక్కువ స్పందన వచ్చింది. తాను మ్యానువల్‌గా 300 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే 20 ఇంటర్య్యూ కాల్స్‌ వచ్చాయని జోసెఫ్‌ తెలిపాడు. కొన్ని సార్లు అప్లికేషన్‌లోని ప్రశ్నలకు ఈ ఏఐ సంబంధం లేని సమాధానాలను అందిస్తుండటడం కూడా పెద్దగా స్పందన రాకపోవడానికి కారణమని పేర్కొన్నాడు. సమయం ఆదా అయినప్పటికీ ఏఐ సాయంతో సక్సెస్‌ రేటు తక్కువే అని జోసెఫ్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని