పసిడి డెలివరీకి 2 దేశీయ సంస్థలు

మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ ఆఫ్‌ ఇండియా (ఎంసీఎక్స్‌) తన ప్లాట్‌ఫాంపై పసిడి డెలివరీ నిమిత్తం రెండు దేశీయ పసిడి రిఫైనర్లు ఎం డి ఓవర్‌సీస్‌, కుందన్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌లను ఎంపిక చేసుకుంది.

Published : 05 Feb 2021 00:31 IST

ఎంపిక చేసుకున్న ఎంసీఎక్స్‌
తొలుత 100 గ్రాముల కడ్డీలతో ప్రారంభం

ముంబయి: మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ ఆఫ్‌ ఇండియా (ఎంసీఎక్స్‌) తన ప్లాట్‌ఫాంపై పసిడి డెలివరీ నిమిత్తం రెండు దేశీయ పసిడి రిఫైనర్లు ఎం డి ఓవర్‌సీస్‌, కుందన్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌లను ఎంపిక చేసుకుంది. ఇప్పటివరకు లండన్‌ బులియన్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ అనుమతి ఉన్న రిఫైనర్లు మాత్రమే పసిడి, వెండి కడ్డీలను డెలివరీ చేస్తున్నాయని ఎంసీఎక్స్‌ ఒక ప్రకనటలో తెలిపింది. ఎంపిక చేసుకున్న ఈ రెండు దేశీయ రిఫైనర్లు, శుద్ధి చేసిన పసిడి కడ్డీల డెలివరీని తొలుత డెరివేటివ్‌ కాంట్రాక్టులోని 100 గ్రాముల పసిడి కడ్డీలతో ప్రారంభిస్తాయని పేర్కొంది. మరికొన్ని రిఫైనర్లపై ప్రస్తుతం ఆడిట్‌ ప్రక్రియ జరుగుతోందని, ఇవి కూడా త్వరలో జత అవుతాయని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని