Twitter: ట్విటర్‌ పరిణామాలపై అమెరికా ఎఫ్‌టీసీ ఆందోళన

ఇటీవల ట్విటర్‌లో చోటు చేసుకొంటున్న పరిణామాలపై అమెరికా నియంత్రణ సంస్థ ఎఫ్‌టీసీ (ది ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Updated : 11 Nov 2022 15:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల ట్విటర్‌లో చోటు చేసుకొంటున్న పరిణామాలపై అమెరికా నియంత్రణ సంస్థ ఎఫ్‌టీసీ (ది ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ట్విటర్లోని ప్రైవసీ, కాంప్లియెన్స్‌ ఆఫీసర్లు ఉద్యోగాన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం సంస్థ ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ విభాగం అధిపతి యేల్‌ రోత్‌ తన ట్విటర్‌ ప్రొఫైల్‌ను అప్‌డేట్‌ చేశాడు. దీని ఆధారంగా అతడు సంస్థను వీడినట్లు తెలుస్తోంది. చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ డామియన్‌ కైరిన్‌, చీఫ్‌ కాంప్లియెన్స్‌ ఆఫీసర్‌ మారియానే ఫొగర్టీ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటికే చీఫ్‌ సెక్యూరిటీ అధికారి లియా కిస్సెనెర్‌ సంస్థను వదిలి వెళ్లిపోయారు. దీంతో నియంత్రణ సంస్థల ఆదేశాలను పాటించడం ట్విటర్‌కు కష్టంగా మారిపోయింది. 

వినియోగదారుల డేటా విక్రయించిందనే ఆరోపణలపై సంస్థకు మే నెలలో 150 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించారు. అంతేకాదు సరికొత్త గోప్యత నియమాలను కూడా ట్విటర్‌ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌టీసీ స్పందిస్తూ.. సరికొత్త ట్విటర్‌ లేదా దాని అధిపతి చట్టానికి అతీతులేమీ కాదని వ్యాఖానించింది. తీవ్రమైన ఆందోళనతో ట్విటర్‌ పరిణామాలను గమనిస్తున్నట్లు పేర్కొంది. తమ ఆదేశాలను పాటించి తీరాల్సిందేనని ఎఫ్‌టీసీ తేల్చిచెప్పింది. దివాలా తీసే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని ఇటీవల ఉద్యోగులకు మస్క్‌ వెల్లడించాడు. మస్క్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ట్విటర్‌ అస్తవ్యస్తంగా మారిపోయిందనే విమర్శలున్నాయి. వెరిఫైడ్‌ ఖాతాల కోసం ట్విటర్‌ సొమ్ము తీసుకోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని