Veranda Learning IPO: 29న వరండా సొల్యూషన్స్‌ ఐపీఓ.. ధరల శ్రేణి ఎంతంటే?

వివిధ పోటీ పరీక్షలకు శిక్షణనందిస్తోన్న వెరండా లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ ఐపీఓకి మార్చి 29న ప్రారంభం కానుంది....

Published : 26 Mar 2022 11:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివిధ పోటీ పరీక్షలకు శిక్షణనందిస్తోన్న వరండా లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ ఐపీఓ మార్చి 29న ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ పబ్లిక్‌ ఇష్యూ మార్చి 31న ముగియనుంది. మొత్తం రూ.200 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో కంపెనీ ఐపీఓకి వస్తోంది. ఈ ఐపీఓకి సంబంధించిన కీలక వివరాలు..

ధరల శ్రేణి: ఒక్కో ఈక్విటీ షేరుకి రూ.130-137

కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 100 (ఒక లాట్‌)

గరిష్ఠంగా ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 1400 (14 లాట్లు)

ముఖ్య విలువ: ఒక్కో షేరుకి రూ.10

వివిధ కేటగిరీలకు రిజర్వు చేసిన షేర్లు..

క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్‌: 75%

నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ బిడ్డర్స్‌: 15%

రిటైల్‌ ఇన్వెస్టర్లు: 10%

గుర్తుంచుకోవాల్సిన తేదీలు..

ఐపీఓ ప్రారంభ తేది: మార్చి 29

ఐపీఓ ముగింపు తేది: మార్చి 31

బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ తేది: ఏప్రిల్‌ 5

రీఫండ్‌ల ప్రారంభ తేది: ఏప్రిల్‌ 6

డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ: ఏప్రిల్‌ 6

ఐపీఓ లిస్టింగ్‌ తేది: ఏప్రిల్‌ 7

ఐపీఓ నిధుల సమీకరణ లక్ష్యం..

* రుణ చెల్లింపులు

* ఎడ్యురేకా కొనుగోలుకు నిధుల కేటాయింపు

* ఇతర సంస్థ విస్తరణ కార్యకలాపాలు

కంపెనీ వివరాలు..

వరండా లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ను 2018లో స్థాపించారు. వివిధ పోటీ పరీక్షలకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా శిక్షణనందించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. యూపీఎస్సీ, సీఏ, బ్యాంకింగ్‌, రైల్వే, స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్స్‌, ఎస్‌ఎస్‌సీ.. ఇలా అనేక విభాగాల్లో ఈ సంస్థ శిక్షణనందిస్తోంది. వరండా రేస్‌, వరండా సీఏ, వరంగా ఐఏఎస్‌, ఎడ్యురేకా ఈ కంపెనీకి అనుబంధంగా పనిచేస్తున్నాయి. డిసెంబరు 31, 2021 నాటికి 42,667 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 16,793 మంది ఆఫ్‌లైన్‌ ద్వారా, 25,874 మంది ఆన్‌లైన్‌ మాధ్యమంలో శిక్షణ పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని