ఆదాయ‌పు కొత్త‌ ప‌న్ను పోర్ట‌ల్‌కి లాగిన్ అవ్వాలంటే.. ఏం కావాలి? 

ప‌న్ను చెల్లింపుదారుల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించేందుకు ఆదాయ‌పు ప‌న్ను(ఐటీ) శాఖ కొత్త ఇ-ఫైలింగ్ పోర్ట‌ల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త పోర్ట‌ల్ www.incometax.gov.in జూన్ 7, 2021 నుంచి అందుబాటులోకి వ‌చ్చింది. కొత్త ఇ- పోర్ట‌ల్‌తో మ‌రింత సులువుగా, సౌక‌ర్య‌వంతంగా ప‌న్ను చెల్లింపుదారులు త‌మ రిట‌ర్నుల ప్ర‌క్రియ‌ను పూర్తిచేయ‌వ‌చ్చు. 

ఇ- ఫైలింగ్ పోర్ట‌ల్‌కి లాగిన్ అయ్యే విధానం ద‌శ‌ల వారీగా..
ప‌న్ను రిట‌ర్నులు, సంబంధిత ప‌నుల కోసం ఇ-ఫైలింగ్ పోర్టల్ లో ముందుగా రిజిస్ట‌ర్ చేసుకోవాలి. ఆధార్ ఓటీపీ, నెట్‌బ్యాంకింగ్‌, స్టాటిక్ పాస్‌వ‌ర్డ్‌ల‌తో పాటు ఇత‌ర మార్గాల‌లో కూడా ఆదాయ‌పు ప‌న్ను పోర్ట‌ల్‌కి లాగిన్ అవ్వ‌చ్చు. 

మొబైల్ నెంబ‌రు, ఇ-మెయిల్ ద్వారా లాగిన్ అయ్యే విధానం..
* ఆదాయ‌పు ప‌న్ను వెబ్‌సైట్‌కి వెళ్లి హోమ్ పేజీలో లాగిన్‌పై క్లిక్ చేయాలి

ఎంట‌ర్ యూజ‌ర్ ఐడి అని ఉన్న బాక్సులో  పాన్ నెంబ‌రు రాసి కంటిన్యూ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. 

* మీకు వ‌చ్చిన సెక్యూరిటీ యాక్సెస్ మేసేజ్‌ను నిర్ధారించుకుని, పాస్ వ‌ర్డ్ ఎంట‌ర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయాలి. 

* ఓటీపీ కోసం వాయిస్ కాల్ గానీ, టెక్స్ మేసేజ్  రెండింటిలో ఒక ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. 

* మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ లేదా ఇ-మెయిల్‌కి వ‌చ్చిన‌ ఓటీపీని ఎంట‌ర్ చేసి ఇ-ఫైలింగ్ పోర్ట‌ల్‌కి లాగిన్‌ అవ్వ‌చ్చు. 

* వాలిడేష‌న్ పూర్తైన త‌రువాత ఇ-ఫైలింగ్ పోర్ట‌ల్ డ్యాష్ బోర్డ్ క‌నిపిస్తుంది. 

గ‌మ‌నిక..
* ఓటీపీకి 15 నిమిషాలు మాత్ర‌మే వ్యాలిడిటి ఉంటుంది. 

* స‌రైన ఓటీపీని ఎంట‌ర్ చేసేందుకు మూడు అవ‌కాశాలు ఉంటాయి. 

* ఓటీపీ ఎక్స్‌పయిరీ టైమ్ స్క్రీన్‌పై క‌నిపిస్తుంది. 

* రీసెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తే మ‌రోసారి కొత్త ఓటీపీ వ‌స్తుంది. 

ఆధార్‌, ఓటీపీతో లాగిన్ చేసే విధానం..
* ఇ-ఫైలింగ్ పోర్ట‌ల్ హోమ్‌పేజీలో క‌నిపిస్తున్న‌ 'లాగిన్‌'పై క్లిక్ చేయాలి. 

* యూజ‌ర్ ఐడి బాక్సులో ఆధార్ నెంబ‌రు ఎంట‌ర్ చేసి 'కంటిన్యూ'పై క్లిక్ చేయాలి. ఆధార్‌తో లింక్ అయిన రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది. 

* హైయ‌ర్ సెక్యూరిటీ ఆప్ష‌న్ కోసం ఆధార్ ఓటీపీని ఉప‌యోగించాల‌నుకుంటే, యూజ‌ర్ ఐడి, పాస్‌వ‌ర్డ్‌తో లాగినయ్యి హైయ‌ర్ సెక్యూరిటీ ఆప్ష‌న్ పేజ్‌లో ఆధార్‌-రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌రుపై క్లిక్ చేసి కంటిన్యూ చేయాలి. 

* మీకు ఒక‌వేళ అప్ప‌టికి ఓటీపీ వ‌చ్చి ఉంటే 'I already have an OTP' పై క్లిక్ చేసి, ఆరు అంకెల ఓటీపిని ఎంట‌ర్ చేసి లాగిన్ అవ్వ‌చ్చు. 

ఒక‌వేళ రాక‌పోతే వెరిఫికేష‌న్ కోసం ఆధార్ వివ‌రాలు వ్యాలిడేట్ చేసేందుకు అంగీక‌రిస్తున్న‌ట్లు అక్క‌డ క‌నిపిస్తున్న బాక్స్‌లో మార్క్ చేసి జ‌న‌రేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. 

* వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి లాగిన్ అయితే ఇ-ఫైలింగ్ పోర్ట‌ల్ డ్యాష్ బోర్డ్ క‌నిపిస్తుంది. 

నెట్ బ్యాంకింగ్ ద్వారా వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యే విధానం..
*  ఇ-ఫైలింగ్ పోర్ట‌ల్ హోమ్ పేజీలో క‌నిపించే లాగిన్‌పై క్లిక్ చేయాలి.  

* అధిక సెక్యూరిటీ ఆప్ష‌న్‌గా నెట్ బ్యాంకింగ్‌ను ఎంచుకుంటే యూజ‌ర్ ఐడి, పాస్‌వ‌ర్డ్‌ని ఎంట‌ర్ చేసి నెట్ బ్యాంకింగ్‌ని క్లిక్ చేసి మీకు కావ‌ల‌సిన బ్యాంకును ఎంచుకోవ‌చ్చు...లేదా

* ఇ-ఫైల్లింగ్ వ్యాలెట్ హైయ‌ర్ సెక్యురిటీ ద్వారా కాకుండా పేజీ దిగువ‌న ఉన్న నెట్ బ్యాంకింగ్‌ని క్లిక్ చేసి.. మీ బ్యాంక్‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు.

* అక్క‌డ ఇచ్చిన వివ‌రాల‌ను చ‌దివి అర్థం చేసుకున్న త‌ర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేయాలి. 

* ఇక్క‌డ్ మీ నెట్ బ్యాంకింగ్ యూజ‌ర్ ఐడి, పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఎంట‌ర్ చేసి ఖాతాను యాక్సెస్ చేయ‌వ‌చ్చు. 

*  లాగిన్ చేసిన త‌రువాత బ్యాంకు వెబ్‌సైట్‌కి వెళ్లి ఇ-ఫైలింగ్ పోర్ట‌ల్ లింక్‌పై క్లిక్ చేస్తే, ఇ-ఫైలింగ్ డ్యాష్‌బోర్డ్ క‌నిపిస్తుంది. 

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని