Zomato: జొమాటోకు మరో సహ వ్యవస్థాపకుడు గుడ్‌బై

Zomato Co-founder resigns: జొమాటోలో రాజీనాల పర్వం కొనసాగుతోంది. కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన గుంజన్‌ పాటీదార్‌ కంపెనీ నుంచి వైదొలిగారు.

Published : 02 Jan 2023 21:50 IST

 

దిల్లీ‌: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో (Zomato)లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ గుంజన్‌ పాటీదార్‌ కంపెనీ నుంచి వైదొలిగారు. గతేడాది నవంబర్‌లో మరో సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా రాజీనామా చేసిన 45 రోజులకే ఈ రాజీనామా చోటుచేసుకోవడం గమనార్హం. జొమాటోను స్థాపించిన తొలి రోజుల్లో పనిచేసిన కొద్ది మంది ఉద్యోగుల్లో ఒకరుగా ఉన్న పాటీదార్‌.. తమ కంపెనీ సాంకేతికపరమైన పురోగమనంలో కీలకంగా వ్యవహరించారని జొమాటో పేర్కొంది. ఈ మేరకు స్టాక్‌ ఎక్సేంజీకి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

గత పదేళ్లకు పైగా ఆయన ఆయన టెక్నికల్‌గా తమ సంస్థను ముందుకు నడిపించే బృందానికి నాయకత్వం వహించారని.. జొమాటో ఎదుగుదలలో ఆయన సహకారం మరువలేనిదని జొమాటో పేర్కొంది. అయితే, ఆయన రాజీనామాకు గల కారణాలేంటనేది మాత్రం వెల్లడించలేదు. గతం మోహిత్‌ గుప్తా సహా రాహుల్‌ గంజూ, సిద్దార్థ్‌ జవార్‌,గౌరవ్‌ గుప్తా వంటి ఉన్నతస్థాయి ఉద్యోగులు గతేడాది వరుసగా కంపెనీని వీడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని