Prakasam: తెలుగురైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై హత్యాయత్నం

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది.

Updated : 20 Feb 2024 20:14 IST

ఒంగోలు క్రైం: తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై ప్రకాశం జిల్లా ఒంగోలులో హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఒంగోలులోని రమేశ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జయరాం సెంటర్‌లోని జిమ్స్‌ ఆసుపత్రిలో   డాక్టర్‌ రామచంద్రారెడ్డితో ఆర్థిక లావాదేవీలపై చర్చిస్తుండగా.. ఆయన అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. కత్తులతో దాడి చేయడంతో శ్రీనివాస్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. చర్చల కోసం పిలిచి పథకం ప్రకారం దాడిచేసినట్టు అనుమానిస్తున్నారు. మర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై తెదేపా అధినేత చంద్రబాబు ఆరాతీశారు. ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని