PPE KITS: పీపీఈ కిట్లను ఉతికి.. మళ్లీ విక్రయిస్తూ..!

శంలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తున్న వేళ ఓ వీడియో కలకలం రేపింది. వైద్య వ్యర్థాల నిర్వీర్యం చేసే ఓ సంస్థ ఉద్యోగులు పీపీఈ కిట్లను ఉతకడం వైరల్‌గా మారింది. వినియోగించిన పీపీఈ కిట్లు, గ్లౌజులను నిర్వీర్యం చేయాల్సింది పోయి.. వాటిని ఉతికి

Published : 31 May 2021 01:08 IST

దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం

మధ్యప్రదేశ్‌: దేశంలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తున్న వేళ ఓ వీడియో కలకలం రేపింది. వైద్య వ్యర్థాల నిర్వీర్యం చేసే ఓ సంస్థ ఉద్యోగులు పీపీఈ కిట్లను ఉతకడం వైరల్‌గా మారింది. వినియోగించిన పీపీఈ కిట్లు, గ్లౌజులను నిర్వీర్యం చేయాల్సింది పోయి.. వాటిని ఉతికి విక్రయిస్తున్నారు. ఓ చోట భారీ సంఖ్యలో వాడిపడేసి ఉన్న పీపీఈ కిట్లు, గ్లౌజులను కొందరు నీటిలో ఉతుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. శుభ్రం చేసి ఆరబెట్టి, మడతబెట్టిన కొన్ని పీపీఈ కిట్లు కూడా అక్కడ ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాకు చెందిన ఓ సంస్థ ఈ రకంగా పీపీఈ కిట్లను వేడి నీటిలో శుభ్రం చేసి వాటిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ విషయంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని సత్నా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రాజేశ్‌ షాహి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి బృందం సంబంధిత బయో వేస్ట్ ప్లాంట్‌కు చేరుకొని దర్యాప్తు ప్రారంభించింది. 2006 నుంచే సదరు సంస్థ వైద్య వ్యర్థాలను సేకరిస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సదరు ప్లాంట్‌ వైద్య వ్యర్థాలను నిర్వీర్యం చేయడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సదరు ప్లాంట్‌ ఉద్యోగిని మీడియా ప్రశ్నించగా.. ‘పీపీఈ కిట్లను నిర్వీర్యం చేయకుండా వాటిని శుభ్రం చేయాలని మా అధికారులు చెప్పారు. వేడి నీరు వైరస్‌ను చంపేస్తుందని తెలిపారు. నిర్వీర్యం చేసేందుకు మా సంస్థకు ప్రతి రోజు దాదాపు వెయ్యి పీపీఈ కిట్లు వస్తాయి’ అని ఆ ఉద్యోగి పేర్కొనడం గమనార్హం. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని