మాజీ మంత్రి అఖిలప్రియ విడుదల

బోయిన్‌పల్లిలోని ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. కిడ్నాప్‌ కేసులో..........

Published : 23 Jan 2021 18:43 IST

హైదరాబాద్‌: బోయిన్‌పల్లిలోని ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియకు నిన్న బెయిల్‌ మంజూరైన విషయం తెలిసిందే. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను సికింద్రాబాద్‌ న్యాయస్థానం మంజూరు చేసింది. 15 రోజులకోకసారి బోయిన్‌పల్లి ఠానాలో సంతకాలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆమె విడుదలవుతున్న సందర్భంగా చంచల్‌గూడ జైలు వద్దకు అఖిలప్రియ బంధువులతో పాటు ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల నుంచి అనుచరులు భారీగా తరలివచ్చారు. దీంతో జైలు పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారింది.

హఫీజ్‌పేటలోని భూవివాదం నేపథ్యంలో ప్రవీణ్‌రావు, సునీల్‌ రావు, నవీన్‌రావు అనే ముగ్గురు సోదరుల కిడ్నాప్‌పై బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరికొందరి పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. దీనిలో భాగంగా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి..

పెరుగుతున్న వింతవ్యాధి బాధితులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని