రూ.60 లక్షల సిగరెట్లు ఎత్తుకెళ్లారు!

రాజధాని నగరంలోని చందానగర్‌ ఠాణా పరిధిలో భారీ చోరీ జరిగింది. ఏకంగా రూ.60 లక్షలకుపైగా విలువైన సిగరెట్‌ డబ్బాల కార్టన్లను దొంగలు ఎత్తుకెళ్లారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 04 Jan 2020 09:07 IST

చందానగర్‌లో భారీ చోరీ

హైదరాబాద్‌ : రాజధాని నగరంలోని చందానగర్‌ ఠాణా పరిధిలో భారీ చోరీ జరిగింది. ఏకంగా రూ.60 లక్షలకుపైగా విలువైన సిగరెట్‌ డబ్బాల కార్టన్లను దొంగలు ఎత్తుకెళ్లారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌ శ్రీదేవి థియేటర్‌ రోడ్డు పద్మజకాలనీలో నాలుగంతస్తుల భవనంలో మొదటి మూడు అంతస్తుల్లో ఓ ప్రైవేటు పాఠశాల ఉండగా నాలుగో అంతస్తు, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సిగరెట్ల హోల్‌సేల్‌ వ్యాపారం సాగుతోంది. శుక్రవారం ఉదయం సిబ్బంది విధులకు వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండటంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. గురువారం అర్ధరాత్రి ముసుగులు ధరించి వ్యాన్‌లో వచ్చిన నలుగురు వ్యక్తులు మెట్ల మార్గం నుంచి నాలుగో అంతస్తులోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. గడ్డపారతో ఇనుప జాలీ గేటు ధ్వంసం చేసి వారు లోపలికి వెళ్లారు. ముందుగా సీసీ కెమెరాల కనెక్షన్లు తొలగించారు. గోదాంలో రూ.6 కోట్ల సరకు ఉండగా.. ఖరీదైన సిగరెట్లు ఉన్న సుమారు 60 కార్టన్లను ఎత్తుకెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని