Suicides: వివాహితుల్లోనే ఆత్మహత్యలు ఎక్కువ

హైదరాబాద్‌ దేశవ్యాప్తంగా పెళ్లికాని వారికంటే పెళ్లయినవారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Published : 29 Oct 2021 11:08 IST

 ప్రమాద మరణాల్లో 15వ స్థానంలో తెలంగాణ 

వడదెబ్బ మరణాలు రాష్ట్రంలోనే అధికం

ఈనాడు - హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పెళ్లికాని వారికంటే పెళ్లయినవారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణమవుతున్నాయి. ప్రమాదాలు, ఆత్మహత్యలకు సంబంధించి జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) 2020 నివేదికలో ఈ వివరాలు పొందుపరిచింది. 2019తో పోలిస్తే 2020లో ఆత్మహత్యలు 5 శాతం పెరిగి 8,058 నమోదైనట్లు వెల్లడించింది. 
 మిగతా వారు పేదరికం, వావాహ సంబంధ విషయాలు, సుఖవ్యాధుల వంటి వాటివల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 

ప్రమాదాలతో..

దేశవ్యాప్తంగా ప్రమాదాలతో 3,74,397 మరణాలు సంభవించాయి. 2019తో పోలిస్తే 12.1 శాతం తగ్గాయి. ఇందులో ప్రకృతి విపత్తుల కారణంగా 7,405 మంది (తెలంగాణలో 170), ఇతర ప్రమాదాల కారణంగా 3,66,992 (తెలంగాణలో 11,652) మంది మృతి చెందారు. తెలంగాణ 15వ స్థానంలో నిలిచింది. మొత్తం ప్రమాద మరణాల్లో అత్యధికంగా రహదారులపై జరిగినవి 39.1 శాతం ఉన్నాయి. 

 దేశవ్యాప్తంగా 2019తో పోలిస్తే ట్రాఫిక్‌(రోడ్డు, రైలు) ప్రమాదాలు 2020లో తగ్గాయి. 2019లో 4,67,171 నమోదు కాగా.. 2020లో వీటి సంఖ్య 3,68,828. తెలంగాణలో ఈ సంఖ్య 19,505. 

• దేశవ్యాప్తంగా ట్రాఫిక్‌ ప్రమాద మరణాలు 3,66,992 కాగా.. తెలంగాణలో ఈ సంఖ్య 7,219. 

 దేశవ్యాప్తంగా సంభవించిన రోడ్డు ప్రమాద మరణాల్లో 43.6 శాతం ద్విచక్ర వాహనదారులవే. తర్వాతి స్థానాల్లో కారు (13.2%), ట్రక్కు/లారీల్లో (12.8%) ప్రయాణించినవారున్నారు. అత్యధికంగా 75,333 (56.6%) మంది అధిక వేగం కారణంగానే మృతి చెందారు.

 వడదెబ్బ కారణంగా దేశవ్యాప్తంగా 170 మరణాలు సంభవించగా.. తెలంగాణలో అత్యధికంగా 98 (57.6%) చోటుచేసుకున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని