Fire accident: భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం..

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని రెండంతస్థుల భవనంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.

Updated : 07 May 2022 12:50 IST

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లోని ఓ రెండతస్తుల భవనంలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఐదుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా తొమ్మిది మందిని రక్షించినట్లు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

ఇండోర్‌లోని స్వర్ణ బాగ్‌ కాలనీలో ఉన్న భవనం బేస్‌మెంట్‌లో తెల్లవారుజామున 3.10  గంటలకు షాట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. పార్కింగ్‌లో నిలిపి ఉంచిన వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత భవనం మొత్తం వ్యాపించాయి.  భద్రతా పరికరాలను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో భవన యజమాని అన్సార్‌ పటేల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి..

ఈ ఘటనపై  మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని