Hyderabad: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ ఆత్మహత్య

తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ ఫజల్‌ అలీ బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

Updated : 05 Nov 2023 12:17 IST

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ ఫజల్‌ అలీ బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీతో పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్‌ కాలనీలోని ఓ హోటల్‌లో ఫజల్‌ సూసైడ్‌ చేసుకున్నారు. కుమార్తెతో మాట్లాడిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ పరిశీలించారు. ఫజల్‌ అలీ బలవన్మరణానికి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

ఉదయం 7 గంటల సమయంలో ఫజల్‌ అలీ ఆత్మహత్యకు పాల్పడినట్లు డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. ఉదయం కుమార్తెతో కలిసి ఆయన విధులకు వచ్చారని.. వ్యక్తిగత విషయాలపై ఆమెతో చర్చించారని చెప్పారు. ఫజల్‌ అలీ బలవన్మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎస్కార్‌ ఇన్‌ఛార్జ్‌గా ఆయన పనిచేస్తున్నారని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఫజల్‌ అలీ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు