Hyderabad News: మొబైల్‌ ట్రాకర్‌ ఉపయోగించి నాగరాజు హత్యకు కుట్ర?

సరూర్‌నగర్‌లో జరిగిన నాగరాజు హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Published : 09 May 2022 14:33 IST

హైదరాబాద్‌: సరూర్‌నగర్‌లో జరిగిన నాగరాజు హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను కస్టడీకి కోరుతూ సరూర్‌నగర్‌ పోలీసులు ఎల్బీ నగర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. 

మరోవైపు నాగరాజు హత్య జరిగిన సమయంలో అక్కడ ఎంత మంది ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనాస్థలంలో ఇద్దరిని గుర్తించగా.. మరో ఐదుగురు ఉన్నట్లు మృతుడు నాగరాజు భార్య ఆశ్రిన్‌ సుల్తానా చెప్పారు. నాగరాజు కదలికలను తెలుసుకునేందుకు నిందితులు మొబైల్‌ ట్రాకర్‌ను ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాని ఆధారంగానే హత్యకు కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు మోబిన్‌ స్నేహితుల వివరాలను సేకరిస్తున్నారు. వారిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే పూర్తి సమాచారం వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని