Phone tapping case: ట్యాపింగ్‌ కేసు.. రాధాకిషన్‌రావు రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించి రాధాకిషన్‌ రావు రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. 

Published : 01 Apr 2024 16:29 IST

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించి రాధాకిషన్‌ రావు రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీగా ఉన్న ఆయన్ని కేసులో ఏ4గా చేర్చారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్‌ యజమాని ఆనంద్‌ ప్రసాద్‌ నుంచి రూ.70 లక్షలు సీజ్‌ చేసినట్లు రాధాకిషన్‌రావు వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్‌రావు, ఆయన బంధువుల నుంచి రూ.కోటి సీజ్ చేశామని అంగీకరించారు. ముడుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చెందిన రూ.3.50 కోట్ల స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 2016లో ఓ వర్గానికి చెందిన అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు రాధాకిషన్‌రావు చెప్పారు. ఈ మేరకు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని