
Crime News: ఎంబీఏ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
మైసూరు నగరంలో ఘటన
మైసూరు, న్యూస్‌టుడే: కన్నడిగుల సాంస్కృతిక రాజధాని మైసూరు నగర శివారులోని చాముండి కొండల దిగువన ఎంబీఏ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో స్నేహితుడితో కలిసి చాముండి కొండల దిగువన ఉన్న లలితాద్రిపుర ప్రాంతానికి వెళ్లిన సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆరుగురు కామాంధులు వారిని వెంబడించారు. స్నేహితుడిని తీవ్రంగా గాయపరచి యువతిపై సామూహికంగా అత్యాచారం చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. స్నేహితుడి సాయంతో ఆ యువతి సమీపంలోని ఆసుపత్రిలో చేరారు. విషయాన్ని తెలుసుకున్న డీసీపీ ప్రదీప్ గుంటి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలనహళ్లి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.