కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి

నేపాల్‌లో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా రెండు గ్రామాల్లో కొండచరియలు విరిగిపడి 12 మంది దుర్మరణం పాలయ్యారు.

Published : 14 Sep 2020 01:08 IST

కాఠ్‌మాండూ: నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా రెండు గ్రామాల్లో కొండచరియలు విరిగిపడి 12 మంది దుర్మరణం పాలయ్యారు. నేపాల్‌ ప్రభుత్వ అధికారి మురారి వాస్తి తెలిపిన వివరాల ప్రకారం.. టిబెట్‌ సరిహద్దులో కాఠ్‌మాండూకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారాబీస్‌ గ్రామంలో కొండచరియలు విరిగిపడి 10 మంది దుర్మరణం చెందగా.. మరో 21 మంది అదృశ్యమయ్యారు. బాగ్లూంగ్‌ గ్రామంలో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో ఆయా గ్రామాలు వాటి మధ్యలో కూరుకుపోయాయి. దీంతో గ్రామస్థులకు తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయిందని సహాయక సిబ్బంది తెలిపారు. ఆచూకీ గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. భారీ వర్షాలు, కొండచరియలు పడిపోవడం కారణంగా ఈ జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య దాదాపు 314 మంది మరణించగా, 111 మంది గల్లంతయ్యారని వాస్తి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని