logo

‘నకిలీ పట్టాలతో రూ. 42 లక్షల పరిహారం స్వాహా’

నకిలీ భూ పట్టాలు సృష్టించి తమకు రావాల్సిన నష్ట పరిహారాన్ని కాజేశారని చినరమణయ్యపేటకు చెందిన పలువురు వాపోతున్నారు. గ్రామానికి చెందిన మట్టా సత్తెమ్మకు ఏడుగురు కుమారులు. వీరికి చినరమణయ్యపేట పంచాయతీ కె.వీరవరం

Published : 03 Jul 2022 02:29 IST

న్యాయం చేయాలని కోరుతున్న చినరమణయ్యపేట భూనిర్వాసితులు

దేవీపట్నం, న్యూస్‌టుడే: నకిలీ భూ పట్టాలు సృష్టించి తమకు రావాల్సిన నష్ట పరిహారాన్ని కాజేశారని చినరమణయ్యపేటకు చెందిన పలువురు వాపోతున్నారు. గ్రామానికి చెందిన మట్టా సత్తెమ్మకు ఏడుగురు కుమారులు. వీరికి చినరమణయ్యపేట పంచాయతీ కె.వీరవరం గ్రామంలో సర్వే నంబరు 20లో 10.4 ఎకరాల సాగు భూమి ఉంది. భూమికి సంబంధించిన అన్ని దస్త్రాలు వీరి వద్ద ఉన్నాయి. దాదాపు రెండేళ్లుగా పోలవరం భూసేకరణ అధికారుల చుట్టూ నష్టపరిహారం కోసం తిరిగారు. తీరా ఆ భూమిలో 5.40 ఎకరాలకు సంబంధించి రూ.42 లక్షలు నష్ట పరిహారం చెల్లించామని అధికారులు చెప్పడంతో కంగుతిన్నామని ఆమె కుమారులు రామ్మూర్తి, మెహర్‌బాబాగౌడ్‌ పేర్కొన్నారు. దీనిపై రంపచోడవరం ఏఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదుచేశామని తెలిపారు.

నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకపోతే నిరసన దీక్ష చేపడతామని దేవీపట్నం సర్పంచి కుంజం రాజామణి పేర్కొన్నారు. ముంపు గ్రామాలను ఖాళీ చేసేనాటికి 18 ఏళ్లు నిండిన యువతీయువకులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని