logo

బాక్సింగ్‌లో బాలిక సత్తా

మారుమూల యు.చీడిపాలెంకు చెందిన బాలిక బాక్సింగ్‌ పోటీల్లో సత్తా చాటింది. గ్రామానికి చెందిన దడాల కీర్తి ప్రసన్న వై.రామవరం ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ చదువుతోంది.

Published : 06 Feb 2023 02:58 IST

పతకం అందుకుంటున్న కీర్తి ప్రసన్న

కొయ్యూరు, న్యూస్‌టుడే: మారుమూల యు.చీడిపాలెంకు చెందిన బాలిక బాక్సింగ్‌ పోటీల్లో సత్తా చాటింది. గ్రామానికి చెందిన దడాల కీర్తి ప్రసన్న వై.రామవరం ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్‌-19 స్కూల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించింది. త్వరలో తిరుపతిలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననుంది. కీర్తి ప్రసన్నను ఆదివారం ఎంపీపీ రమేష్‌బాబు, జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని