logo

చేపల వేటవెళ్లి మృత్యుఒడిలోకి..

కుటుంబ పోషణ నిమిత్తం చేపల వేటకు వెళ్లి ఓ గిరిజనుడు మృత్యువాత పడిన ఘటన అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది.

Published : 21 Mar 2023 01:20 IST

రాంబాబు మృతదేహం

అనంతగిరి, న్యూస్‌టుడే: కుటుంబ పోషణ నిమిత్తం చేపల వేటకు వెళ్లి ఓ గిరిజనుడు మృత్యువాత పడిన ఘటన అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. మండలంలోని జీలుగులపాడుకు చెందిన యనమల రాంబాబు (35) చేపల వేట చేస్తూ జీవనం సాగిస్తుంటారు. గ్రామానికి సమీపంలోని గోస్తని నదిలో తెప్పతో వేటాడుతుంటారు. ఎప్పటిలానే సోమవారం ఉదయం రాంబాబు చేపల వేటకు వెళ్లారు. తెప్ప బోల్తా పడటంతో నదిలో పడిపోయారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఊబి ఉండటంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యపడక మృత్యువాతపడ్డారు. అక్కడున్నవారు చూసి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటంబసభ్యుల సమాచారం మేరకు ఘటనాస్థలాన్ని స్థానిక ఎస్సై రాము పరిశీలించి మృతదేహాన్ని బయటకు తీశారు. శవపరీక్ష నిమిత్తం శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాంబాబుకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. ముగ్గురు పిల్లలు చిన్నవారని, తమకు దిక్కెవరంటూ మృతుడి భార్య రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని