logo

‘సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు మృతి’

సీలేరు పీహెచ్‌సీ పరిధిలోని దుప్పిలవాడ ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రెండు నెలల బాబు మృతి చెందాడని దుప్పిలవాడ సర్పంచి కేలాబు కుమారి అన్నారు.

Published : 30 Mar 2023 03:10 IST

చిన్నారి మృతదేహంతో విలపిస్తున్న తల్లి

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు పీహెచ్‌సీ పరిధిలోని దుప్పిలవాడ ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రెండు నెలల బాబు మృతి చెందాడని దుప్పిలవాడ సర్పంచి కేలాబు కుమారి అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ దుప్పిలవాడ గ్రామానికి చెందిన కిల్లో లలితకు రెండు నెలల క్రితం జన్మించిన మగబిడ్డ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించాడన్నారు. ఈనెల 28న దుప్పిలవాడకు చెందిన నాలుగు నెలల గర్భిణి కొర్రా కాంతమ్మకు రక్తస్రావం కావడంతో సీలేరు పీహెచ్‌సీకు తరలించామని, అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి పంపించారన్నారు. ఆమె వెనుక ఒక ఆశా కార్యకర్త, ఉప కేంద్రం సిబ్బంది గానీ వెళ్లలేదని, అక్కడ ఏమి చేయాలో తెలియక సతమతమవుతున్నారన్నారు. ఈ రెండు ఘటనల్లో  వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉందని చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని