మతిస్థిమితం లేని మహిళ ప్రసవం
పురిటినొప్పులతో బాధపడుతున్న మతిస్థిమితం లేని మహిళకు తూర్పు గోదావరికి జిల్లా గోకవరం సీహెచ్‌సీ సిబ్బంది ప్రసవం చేశారు.
తల్లి, బిడ్డతో సీహెచ్‌సీ సిబ్బంది
గోకవరం, న్యూస్‌టుడే: పురిటినొప్పులతో బాధపడుతున్న మతిస్థిమితం లేని మహిళకు తూర్పు గోదావరికి జిల్లా గోకవరం సీహెచ్‌సీ సిబ్బంది ప్రసవం చేశారు. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనివ్వగా తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. వివరాల ప్రకారం గోకవరం సీహెచ్‌సీ ఆవరణలో బుధవారం రాత్రి మతిస్థిమితం లేని మహిళ పురిటి నొప్పులతో ఏడుస్తూ కూర్చుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న స్వీపర్ మిరప పాప గుర్తించి స్టాఫ్ నర్స్ ప్రశాంతి సహాయంతో ఆసుపత్రిలోకి తీసుకొచ్చారు. గురువారం ఆమెకు ప్రసవం చేయగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. రెండు కిలోల బరువుతో పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి ప్రధాన వైద్యురాలు వనజకుమారి, పిల్లల వైద్యురాలు ఝాన్సీ రాణి తెలిపారు. ఆ మహిళ అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం సీతారం గ్రామానికి చెందిందిగా గుర్తించారు. ఆమెకు తల్లిదండ్రులు లేరని, సోదరుడు పట్టించుకోకపోవడంతో మతిస్థిమితం లేకుండా తిరుగుతోందన్నారు. ఆమె గర్భం దాల్చినట్లు గుర్తించిన అక్కడ ఏఎన్‌ఎం ఆసుపత్రిలో చేర్చగా తప్పించుకొని బయటకు వచ్చేసిందన్నారు. అక్కడక్కడ తిరిగి చివరకు గోకవరం ఆసుపత్రికి చేరుకోగా ప్రసవం జరిగిందన్నారు. పోలీసులతోపాటు ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం అందించామని, తల్లీ బిడ్డను హోంకు తరలిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఇంటికో కట్టె తెచ్చి.. శ్మశానానికి హద్దుపెట్టి!
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్