logo

ఉత్తుత్తి ప్రారంభోత్సవం..

పర్యాటకుల సౌకర్యార్థం కొత్తవలస వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో రూ.25 లక్షలు వెచ్చించి ఐటీడీఏ ఆధ్వర్యంలో కాటేజీల నిర్మాణం చేపట్టారు.

Published : 04 Jun 2023 05:20 IST

కాంతిలాల్‌ దండే ఆవిష్కరించిన శిలాఫలకం

అరకులోయ, న్యూస్‌టుడే: పర్యాటకుల సౌకర్యార్థం కొత్తవలస వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో రూ.25 లక్షలు వెచ్చించి ఐటీడీఏ ఆధ్వర్యంలో కాటేజీల నిర్మాణం చేపట్టారు. పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం చేశారు. ఇది జరిగి సుమారు ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. కొత్తవలసలో సుమారు 5 కాటేజీలను రూ. 25 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. పనులు పూర్తి కాకుండానే అధికారులు గతేడాది డిసెంబరులో గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండేతో ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవం జరిగి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. అధికారులు ఎందుకు నిర్మాణాలు పూర్తికాకుండానే ప్రారంభోత్సవం చేశారో అర్థంకాని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి కాటేజీల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై గిరిజన సంక్షేమశాఖ ఏఈ అభిషేక్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. మరో 15 రోజుల్లో కాటేజీలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని