logo

విశాఖకు స్లీపర్‌ బస్సు

ప్రయాణికుల సౌకర్యార్ధం ఈ నెల 28 నుంచి విజయవాడ- విశాఖపట్నం మధ్య నూతనంగా నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సును నడపనున్నట్లు జిల్లా ప్రజారవాణాధికారి ఎం. యేసుదానం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 27 Nov 2022 06:13 IST

విజయవాడ బస్టేషన్‌: ప్రయాణికుల సౌకర్యార్ధం ఈ నెల 28 నుంచి విజయవాడ- విశాఖపట్నం మధ్య నూతనంగా నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సును నడపనున్నట్లు జిల్లా ప్రజారవాణాధికారి ఎం. యేసుదానం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు 9330 సర్వీసు నంబరుతో పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌ నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందన్నారు. విశాఖపట్నం నుంచి 35102 సర్వీసు నంబరుతో రాత్రి 9.45కు బయలుదేరి విజయవాడకు ఉదయం 5.45కు చేరుతుందని పేర్కొన్నారు.ః ఈ సర్వీసుకు కనకదుర్గ వారధి, ఎన్టీఆర్‌ సర్కిల్‌, ఆటోనగర్‌ టెర్మినల్‌, కామయ్యతోపు సెంటర్‌, సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల, కామినేని ఆసుపత్రి, ఎనికేపాడు, విశాఖపట్నంలో గురుద్వార్‌ జంక్షన్‌, అక్కయ్యపాలెం జంక్షన్‌, మురళీనగర్‌  ఎన్‌ఏడీ క్రాస్‌రోడ్‌, షీలా నగర్‌, పాత గాజువాక, కూర్మన్నపాలెం, లంకెలపాలెం వద్ద ఎక్కేందుకు, దిగేందుకు అవకాశం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు