జాతీయ జూడో పోటీలకు మొవ్వ విద్యార్థుల ఎంపిక
అఖిల భారత విశ్వవిద్యాలయాల స్థాయిలో ఆడేందుకు కృష్ణా విశ్వవిద్యాలయం జూడో జట్టులోకి మొవ్వ వీఎస్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు ముగ్గురు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.మాధవి తెలిపారు.
క్రీడాకారులతో మణిప్రసాద్
మొవ్వ(కూచిపూడి), న్యూస్‌టుడే: అఖిల భారత విశ్వవిద్యాలయాల స్థాయిలో ఆడేందుకు కృష్ణా విశ్వవిద్యాలయం జూడో జట్టులోకి మొవ్వ వీఎస్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు ముగ్గురు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.మాధవి తెలిపారు. విజయవాడ సప్తగిరి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కృష్ణా విశ్వవిద్యాలయం జట్టుని ఎంపిక చేశారు. ఇందులో మొవ్వ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల బీఏ మూడో సంవత్సరం విద్యార్థులైన జి.ఉషశ్రీ, పి.అభిషేక్, ఎస్.చందు ఎంపికయ్యారు. పంజాబ్‌లో జనవరి 6 నుంచి జరిగే అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో కృష్ణా విశ్వవిద్యాలయం తరఫున వీరు ఆడనున్నారు. ఎపికైన విద్యార్థులను శనివారం ప్రిన్సిపల్ మాధవి, పి.డి.మణిప్రసాద్, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు..
క్రీడాకారులను అభినందిస్తున్న ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు
అవనిగడ్డ, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు స్థానిక ఎస్వీఎల్ క్రాంతి జూనియర్ కళాశాల విద్యార్థులు అండర్ 18 ఖోఖో పోటీలకు తెనాలి జ్యోతి, యు.లక్ష్మీనారాయణమ్మ ఎంపికైనట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు చెప్పారు. నవంబర్ 29న మైలవరంలోని ఎస్‌ఎస్‌కే పాఠశాలలో జరిగిన ఖోఖో ఎంపికల్లో వీరు పాల్గొని ప్రతిభ కనబరిచి ఎంపికైనట్లు చెప్పారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో కర్నూలులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు.
ఎస్‌జీఎఫ్‌లో...
ఉడుముల అఖిల్‌దీప్ (మొవ్వ) కైలా వెంకటలక్ష్మి (చినముత్తేవి)
చినముత్తేవి(కూచిపూడి), న్యూస్‌టుడే: మొవ్వ మండలం చినముత్తేవి జడ్పీపాఠశాల విద్యార్థిని రాష్ట్రస్థాయి బాలికల అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం ఎన్.శేషసాయికుమార్ తెలిపారు. గుడివాడలో జరిగిన జిల్లాస్థాయి బాలికల అథ్లెటిక్స్‌లో అండర్ 17 విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమం, 1500 మీటర్ల పరుగు పందెంలో 2వ స్థానం సాధించి బాలికల విభాగంలో రాష్ట్రస్థాయిలో ఎంపికైనట్లు చెప్పారు. మొవ్వ శ్రీమండవ కనకయ్య జడ్పీ విద్యార్థి ఉడుముల అఖిల్‌దీప్ అండర్ 17 షాట్‌ఫుట్‌లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రథమస్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాడని హెచ్‌మ్ ఎన్.వి.శ్రీధర్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Eatala Rajender: నాపై కేసీఆర్ దుష్ప్రచారం చేయిస్తున్నారు: ఈటల
-
Ap-top-news News
Gas Cylinder: సిలిండర్ తెచ్చినందుకు అదనపు రుసుము చెల్లించొద్దు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్