logo

కనుల పండువగా కలశ జ్యోతుల ఉత్సవం

భవానీ దీక్షల సందర్భంగా ప్రతి ఏడాది శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి కలశ జ్యోతుల సమర్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది.

Published : 08 Dec 2022 05:07 IST

నగరోత్సవంలో ఉభయ దేవేరులతో స్వామివారు

విజయవాడ వన్‌టౌన్‌, న్యూస్‌టుడే : భవానీ దీక్షల సందర్భంగా ప్రతి ఏడాది శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి కలశ జ్యోతుల సమర్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. బుధవారం రాత్రి విజయవాడ సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి వందల సంఖ్యలో భవానీ భక్తులు, అమ్మవారి భక్తులు కలశ జ్యోతులు చేతబట్టి ఇంద్రకీలాద్రికి బయలుదేరారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ప్రచార రథంలో గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపుగా వచ్చారు. అమ్మవారి ప్రచార రథానికి ఆలయ ఈఓ డి.భ్రమరాంబ ప్రత్యేక పూజలు నిర్వహించి కలశ జ్యోతుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ మార్గాల మీదుగా శ్రీ మల్లికార్జున మహామండపం మార్గంలో ఏర్పాటు చేసిన పాత మెట్ల మార్గంలో కలశ జ్యోతుల ప్రదర్శన ప్రవేశించింది. అప్పటికే అక్కడ చేసిన ఏర్పాటలో భాగంగా ఆలయ సిబ్బంది భక్తుల నుంచి కలశ జ్యోతులను అందుకున్నారు. అనంతరం భక్తులందర్నీ దుర్గమ్మ పాత మెట్ల మార్గం ద్వారా కొండ పైకి అనుమతించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

ప్రదర్శనలో పాల్గొన్న మహిళలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని