logo

కిడ్నీ బాధితులను సీఎం ఆదుకోరా?

తిరువూరు సభలో ప్రతిపక్షాలపై నిందలు వేయడంపై దృష్టి పెట్టిన సీఎం జగన్‌ కిడ్నీ బాధితులను ఆదుకోవడంపై స్పందించలేదని సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు మండిపడ్డారు.

Published : 30 Mar 2023 02:16 IST

బాధితుడి ఇంటి వద్ద మాట్లాడుతున్న బాబూరావు, నాయకులు

ఎ.కొండూరు, న్యూస్‌టుడే: తిరువూరు సభలో ప్రతిపక్షాలపై నిందలు వేయడంపై దృష్టి పెట్టిన సీఎం జగన్‌ కిడ్నీ బాధితులను ఆదుకోవడంపై స్పందించలేదని సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు మండిపడ్డారు. ఎ.కొండూరు, చైతన్యనగర్‌ తండాల్లో బుధవారం పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. కిడ్నీ రోగుల సమస్యలు తెలుసుకున్నారు. గతేడాది డిసెంబరు 28న కిడ్నీ వ్యాధితో మృతి చెందిన భూక్యా సీతమ్మ మట్టి ఖర్చుల నిమిత్తం ఇచ్చిన రూ.10 వేలను అధికారులు వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం చేయాలని డిమాండు చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని