logo

ఈకేవైసీ ఇక్కట్లు

పీఎం కిసాన్‌ పథకం ద్వారా అందించే సాయం జమ కావాలంటే రైతులు అందరూ ఈకేవైసీ చేయించుకోవాలి.

Published : 01 Apr 2023 04:46 IST

జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం పక్కన బల్లలపై వ్యవసాయ సహాయకులు

పీఎం కిసాన్‌ పథకం ద్వారా అందించే సాయం జమ కావాలంటే రైతులు అందరూ ఈకేవైసీ చేయించుకోవాలి. దానికి మార్చి 31వరకే గడువు విధించగా, జిల్లాలో చాలామంది రైతులు ఇంకా ఈకేవైసీ చేయించుకోలేదు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ సహాయకులను శుక్రవారం మచిలీపట్నంలోని జిల్లా వ్యవసాయ కార్యాలయానికి పిలిపించి నమోదు చేయించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన సహాయకులు కలెక్టరేట్‌ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాల్లో చెట్ల కింద, బల్లలపైన కూర్చుని తమ ప్రాంతాల్లో పెండింగ్‌ ఉన్నవాటిని పూర్తి చేసేందుకు అవస్థలు పడ్డారు.

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని