logo

ఆధ్యాత్మిక చైతన్యం అవసరం

నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు.

Published : 18 Apr 2024 04:58 IST

శివస్వామి, భక్తి చైతన్య స్వామి, శివాజీ, సూర్యతేజ తదితరుల ప్రదర్శన

సత్యనారాయణపురం, న్యూస్‌టుడే : నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని పలు హిందూధార్మిక సంస్థల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం శ్రీరామశోభాయాత్ర నిర్వహించారు. సత్యనారాయణపురం బీఆర్టీఎస్‌ రహదారిలోని ఆదిశంకరాచార్య కూడలి రామకోటి వద్ద యాత్ర ఆరంభమైంది. ఆయన ప్రసంగిస్తూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపట్ల చిన్నతనం నుంచే పిల్లల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రపంచంలో భారతీయ సంస్కృతికి ఉన్న గొప్పతనం దేనికీలేదన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జాతి, మత, కుల, వర్గ, లింగ, భేదాలు లేకుండా భారతీయులంతా సంఘటితంగా ఉన్నప్పుడే దుర్మార్గుల దాడుల నుంచి కాపాడుకోగలమన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. భక్తిచైతన్యస్వామి, నాగలింగం శివాజీ, సూర్యతేజ, భారీ సంఖ్యలో యువకులు, మహిళలు, ద్విచక్రవాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, లక్ష్మీనగర్‌, అజిత్‌సింగ్‌నగర్‌ మీదుగా యాత్ర సాగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని