logo

ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి చర్యలు

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, అవి వేగవంతంగా సాగే దిశగా క్షేత్రస్థాయిలో చర్యలను చేపట్టామని గృహ నిర్మాణ పీడీ రాజశేఖర్‌ పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండలోని రాయంపల్లి దారిలో ఉన్న లేఅవుట్‌లో ఆ

Published : 30 Jun 2022 02:43 IST


లేఅవుట్‌లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చిస్తున్న అధికారులు

ఉరవకొండ, న్యూస్‌టుడే: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, అవి వేగవంతంగా సాగే దిశగా క్షేత్రస్థాయిలో చర్యలను చేపట్టామని గృహ నిర్మాణ పీడీ రాజశేఖర్‌ పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండలోని రాయంపల్లి దారిలో ఉన్న లేఅవుట్‌లో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఇషాన్‌ బాషా, విద్యుత్తు డీఈఈ రాజశేఖర్‌తో కలిసి పర్యటించారు. అక్కడ నీటి సదుపాయం కల్పనకు సత్వర చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లాలో 258 జగనన్న కాలనీల్లో 64,802 గృహాలు మంజూరు కాగా.. వాటిలో పునాది స్థాయిలో 29,897, బేస్‌మెంట్‌ స్థాయిలో 12,851, ఆర్‌ఎల్‌ స్థాయిలో 2,436 నిర్మాణాలు ఉన్నాయన్నారు. 7029 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. మరో 12,592 నిర్మాణాలు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. బిల్లుల మంజూరులో జాప్యం లేదని చెప్పారు. అనంతరం ఆయన ఉరవకొండ మండల పరిషత్తు కార్యాలయంలో గ్రామ సచివాలయాల ఇంజినీరింగు సహాయకులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీపీ చంద్రమ్మ, గృహ నిర్మాణ డీఈఈలు వరప్రసాద్‌, శైలజ, ఏఈఈలు శ్రీనివాసులు, గోవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని