logo

జీతాలివ్వకపోతే ఉద్యమిస్తాం

శ్రీసత్యసాయి జిల్లావ్యాప్తంగా స్వచ్ఛభారత్‌ కార్మికులకు వేతనాలు సకాలంలో అందకపోవడంతో కుటుంబపోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే స్పందించకపోతే ఉద్యమిస్తామని ఏపీ గ్రామ పంచాయతీ స్వచ్ఛభారత్‌

Published : 09 Aug 2022 04:07 IST

కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న సీఐటీయూ, స్వచ్ఛభారత్‌ కార్మికులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లావ్యాప్తంగా స్వచ్ఛభారత్‌ కార్మికులకు వేతనాలు సకాలంలో అందకపోవడంతో కుటుంబపోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే స్పందించకపోతే ఉద్యమిస్తామని ఏపీ గ్రామ పంచాయతీ స్వచ్ఛభారత్‌ వర్కర్ల యూనియన్‌ అధ్యక్షుడు వెంకట్రామయ్య హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా స్వచ్ఛభారత్‌ కార్మికులు సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. గేట్‌ వద్ద బైఠాయించి వేతన బకాయిలు అందించాలని డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. కలెక్టర్‌ బసంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేసి సమస్యలను తెలియజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు సజ్జరామప్ప, ప్రధాన కార్యదర్శి రమేష్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఇంతియాజ్‌, ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని