logo

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

పంటలు పండక.. అప్పులు మిగిలి.. వాటిని తీర్చేమార్గం లేక యువరైతు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన విడపనకల్లు మండలంలో చోటుచేసుకుంది. కుటుంబీకులు, గ్రామస్థుల వివరాల మేరకు.. పొలికి గ్రామానికి చెందిన సుమన్‌(35)కి

Published : 10 Aug 2022 05:10 IST

ఉరవకొండ, విడపనకల్లు, న్యూస్‌టుడే: పంటలు పండక.. అప్పులు మిగిలి.. వాటిని తీర్చేమార్గం లేక యువరైతు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన విడపనకల్లు మండలంలో చోటుచేసుకుంది. కుటుంబీకులు, గ్రామస్థుల వివరాల మేరకు.. పొలికి గ్రామానికి చెందిన సుమన్‌(35)కి 2.45 ఎకరాల పొలం ఉంది. మరో 6 ఎకరాలు కౌలుకుని తీసుకుని కొన్నేళ్లుగా మిరప సాగు చేశారు. రెండేళ్లుగా పెట్టిన పెట్టుబడి కూడా దక్కలేదు. రూ.15 లక్షల వరకు అప్పులయ్యాయి. వాటిని తీర్చాలని హైదరాబాద్‌ వలస వెళ్లి కొన్నాళ్లుగా అక్కడే పనులు చేసుకుంటున్నారు. పిల్లలను బడిలో చేర్పించేందుకు రెండురోజుల కిందట గ్రామానికి వచ్చారు. అప్పులు ఇచ్చినవారి నుంచి ఒత్తిడి అధికమవడంతో భరించలేక సోమవారం రాత్రి ఇంట్లో పురుగుమందు తాగారు. గమనించిన కుటుంబసభ్యులు గుంతకల్లుకు తరలించారు. అక్కడి నుంచి అనంతపురం తీసుకెళుతుండగా మంగళవారం మృతి చెందారు. భర్త లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని భార్య సునీత స్పృహ కోల్పోయింది. ముగ్గురు కొడుకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని