logo

అరకొర పరిహారం ఇస్తే ఒప్పుకోం

అరకొర పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని 544డీ జాతీయ రహదారి నిర్వాసితులు స్పష్టం చేశారు.

Published : 24 Jan 2023 05:19 IST

ప్రసంగిస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: అరకొర పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని 544డీ జాతీయ రహదారి నిర్వాసితులు స్పష్టం చేశారు. 544డీ జాతీయ రహదారి నిర్వాసితుల సంఘం, ఏపీ రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వీరి నిరసనకు సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ సంఘీభావం తెలిపి మాట్లాడారు.  వైకాపాకు అనుకూలంగా ఉన్న వారిని సమావేశాలకు పిలిచి మాట్లాడితే సరిపోదన్నారు. నిర్వాసితుల సంఘం కన్వీనర్‌ శివారెడ్డి, రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సెంటుకు రూ.50 వేలు చొప్పున చెల్లించాలని, భూములు కోల్పోయే రైతులకు పరిహారంతోపాటు ప్రభుత్వ భూమి కేటాయించాలని డిమాండు చేశారు. ఆర్డీఓ మధుసూదన్‌ ధర్నా శిబిరానికి వచ్చి నిర్వాసితులతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని