logo

ప్రాచీన కళకు ప్రోత్సాహం కరవు

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండల కేంద్రానికి సమీపంలో ఉండే నిమ్మలకుంట గ్రామం రాష్ట్రంలోనే ఏకైక తోలుబొమ్మల తయారీ కేంద్రంగా పేరుగాంచింది.

Published : 04 Feb 2023 04:00 IST

భవనం చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలు

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండల కేంద్రానికి సమీపంలో ఉండే నిమ్మలకుంట గ్రామం రాష్ట్రంలోనే ఏకైక తోలుబొమ్మల తయారీ కేంద్రంగా పేరుగాంచింది. ఈ గ్రామంలో దాదాపు 150 కుటుంబాలు తోలుబొమ్మల తయారీని తరతరాలుగా వారసత్వంగా పొంది జీవనోపాధి సాగిస్తున్నారు. ఎంతో సూక్ష్మమైన చిత్రాలు గీసి తయారు చేసే తోలుబొమ్మలతో పాటు మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇంట్లో అందానికి బెడ్‌ల్యాంపులు, గోడలకు అమర్చుకునే వస్త్ర చిత్రాలు, చిన్నపాటి ఆభరణాలను కళాకారులు తయారు చేస్తారు. నిమ్మలకుంట గ్రామం నుంచి ఈ కళలో జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్న కళాకారులూ ఉన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారు తయారు చేసే బొమ్మలకు, వస్తువులకు మంచి డిమాండు ఉంది. అయితే కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. ఈ కళను మరింత విస్తృతం చేసేందుకు గ్రామీణ పర్యాటకంలో భాగంగా గ్రామంలో 2007లో భవనం నిర్మించారు. కళకు సంబంధించిన అన్ని విషయాలు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఈ భవనం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. మద్యంబాబులకు అడ్డాగా మారింది. పర్యాటక శాఖ అధికారులు భవనాన్ని పునరుద్ధరుంచి కార్యకలాపాలు కొనసాగించాలని తోలుబొమ్మల కళాకారులు కోరుతున్నారు.

ఈనాడు, అనంతపురం - న్యూస్‌టుడే, ధర్మవరం

బొమ్మల తయారీలో మహిళలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని